Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఎట్టకేలకు ఒక ఇంటి వాడు కాబోతున్నాడు. రక్షిత రెడ్డితో అతడి వివాహం నేడు జరగనుంది. రాయల్ ప్యాలెస్ శర్వా పెళ్లికోసం ముస్తాబయ్యింది. ఈ వేడుకలు 2 రోజులపాటు అట్టహాసంగా జరగనున్న విషయం తెల్సిందే. ఇప్పటికే శర్వానంద్ కుటుంబం జైపూర్ కు చేరుకుంది. అక్కడే పెళ్ళికొడుకు పసుపు ఫంక్షన్ ను నిర్వహించారు. ఇక హల్దీ ఫంక్షన్ లో సందడంతా శర్వాదే అని తెలుస్తోంది. ఈ హల్దీ ఫంక్షన్ కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో శర్వాకు పసుపు పూసి స్నేహితులు ఆటపట్టిస్తుండగా.. శర్వా సైతం వారిని వదలకుండా పసుపు పూస్తూ కనిపించాడు. ఇక శర్వా కజిన్స్ అందరు.. అతడిని స్విమింగ్ పూల్ లో తోయడం.. నీళ్లు పోసి ఏడిపించడం చూస్తుంటే అసలు సిసలైన పెళ్లి వేడుకలు కనిపిస్తున్నాయి.
Nidhi agarwal :అందంగా కనబడటానికి ఆ పార్ట్ కి సర్జరీ చేయించుకున్న నిధి అగర్వాల్ ?
ఇంకోపక్క రక్షిత దగ్గర కూడా ఇవే సీన్స్ రీపీట్ అయ్యాయి. ఇష్టపడిన అమ్మాయిని వివాహం చేసుకుంటున్న ఆనందం శర్వాలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇక కొద్దిసేపటిలో వీరి వివాహ వేడుక మొదలుకానుంది. ఈ పెళ్ళికి సినీ స్టార్స్ తో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరవ్వనున్నట్టు తెలుస్తుంది. ఈ నైట్ సంగీత్ కు వారందరు కూడా అటెండ్ కానున్నారని తెలుస్తోంది. మరి శర్వా పెళ్ళికి ఏఏ స్టార్ హీరోలు రానున్నారో చూడాలి.