ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా జైపూర్ లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
Also Read : Congress: కేరళ, తెలంగాణ పొత్తు కదురదు, కానీ.. రాహుల్ గాంధీ సన్నిహితుడి కీలక వ్యాఖ్యలు..
తాము మొదట బ్యాటింగ్ చేయనున్నాట్లు రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ ఫాప్ డూప్లెసిస్ అన్నారు. పరిస్థితులకు అనుకూలంగా పిచ్ ఉండవచ్చు.. ఇది పొడి వికెట్ లాగా కనిపిస్తుంది.. మేం మరింత మెరుగ్గా ఆడాల్సిన అవసరం ఉందని డుప్లెసిస్ అన్నాడు. మా టీమ్ లో 3-4గురు కొత్త కుర్రాళ్ళను ప్రతి మ్యాచ్ లో ఆడిస్తున్నట్లు ఆర్సీబీ కెప్టెన్ అన్నారు. గెలుపోటములు ముఖ్యం, నెట్ రన్ రేట్ ఇప్పుడు మమల్ని ఇబ్బంది పెట్టే విషయం కాదు. హేజిల్‌వుడ్ స్థానంలో పార్నెల్, హసరంగా ప్లేస్ లో బ్రేస్‌వెల్ తిరిగి జట్టులోకి వస్తున్నారని ఆర్సీబీ సారథి డుప్లెసిస్ అన్నాడు.
Also Read : Akkineni Heroes: ఈ అక్కినేని హీరోలకి ఏమైంది? ఎవరూ హిట్టుకొట్టరేంటి?
టాస్ గెలిచి ఉంటే తాము ముందుగా బ్యాటింగ్ తీసుకునే వాళ్లమని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అన్నారు. ఒత్తిడి ఉంది, మేము దీనిని సెమీ-ఫైనల్‌గా పరిగణిస్తున్నాము అని వెల్లడించాడు. మిగిలిన మ్యాచ్ ల్లో తాము పోటీ తీవ్రంగా ఉంటుంది.. టోర్నమెంట్ లో కొందరు ఆటగాళ్ళు అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ తో జట్టుకు తొడుగా ఉన్నారని శాంసన్ అన్నాడు. ఇవాళ్టి మ్యాచ్ లో ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు సంజూ శాంసన్ తెలిపారు. ట్రెంట్ బౌల్ట్ స్థానంలో ఆడమ్ జంపాను టీమ్ లోకి తీసుకున్నట్లు సంజూ చెప్పాడు.
Also Read : Custody: టార్గెట్ 27 కోట్లు… రెండు రోజుల్లో వచ్చింది ఇంతేనా?
తుది జట్లు :
రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(w/c), జో రూట్, ధృవ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, KM ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(సి), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(w), మైకేల్ బ్రేస్‌వెల్, వేన్ పార్నెల్, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్.