Rajasthan: ప్రభుత్వ భవనం కింద రూ.2000 నోట్ల కట్టలు, బంగారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: అవినీతి అధికారులు, అవినీతి డబ్బును దాచేందుకు ఏకంగా ప్రభుత్వ భవనాన్నే వాడకున్నారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాజధాని జైపూర్ నగరంలోని యోజన భవన్‌లోని బేస్‌మెంట్‌లో తాళం వేసి ఉన్న అల్మారా నుంచి ₹ 2.31 కోట్ల నగదు, కిలో బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ బేస్‌మెంట్‌లోకి తరుచుగా వెళ్లే ఏడుగురు ప్రభుత్వ అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read Also: PM Modi: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ప్రధాని మోడీ భేటీ.. యుద్ధం తర్వాత ఇదే తొలిసారి
Also Read
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
అల్మారాలో దాచి ఉంచిన ట్రాలీ సూట్‌కేస్‌లో రూ.2000, రూ.500 డినామినేషన్ నోట్లు ఉన్నాయి. ఆర్బీఐ రూ. 2000 కరెన్సీ చెలామణిని ఉపసంహరించుకున్న తర్వాతి రోజే రికవరీ జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు అధికారులు వివరించారు. సూట్‌కేస్ నిండా నగదు, బంగారం కనుగొన్నామని, ఆ తర్వాత అనుమానిత ఉద్యోగులను అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ తరలించామని జైపూర్ పోలీస్ కమిషనర్ ఆనంద్ శ్రీవాస్తవ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మొత్తం రూ. 2.31 కోట్ల నగదు, కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ-ఫైలింగ్ ప్రాజెక్ట్ కింద ఫైళ్లను స్కాన్ చేసి డిజిటలైజ్ చేస్తున్నామని, తాళం వేసి ఉంచిన రెండు అల్మారాలను తెరిచిన సమయంలో భారీగా డబ్బు, బంగారం కనిపించినట్లు అధికారలు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ రెండు అల్మారాలు గత కొంత కాలంగా తాళం వేేసే ఉన్నాయి. డబ్బు ఎవరిది..ఎలా వచ్చింది.. విచారణ జరుపుతున్నారు.. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు అధికారులు. ఈ అంశంపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షం బీజేపీ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. యోజన భవన్ లోకి ఇంత డబ్బు ఎలా వచ్చిందో ముఖ్యమంత్రి చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..