Rajasthan Blast : రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లాలో కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగి ఐదుగురు సజీవ దహనం అయ్యారు. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అనేక అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
Theft : జైపూర్‌లో శుక్రవారం ఓ వ్యాపారి నుంచి దుండగులు రూ.33 లక్షలు దోచుకున్నారు. ఇద్దరు అగంతకులు ఆ వ్యాపారి కళ్లలో కారం కొట్టి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. కారులో కూర్చున్న వ్యాపారి చేతిలోని బ్యాగ్‌ని ఈ దుండగులు లాక్కొని పారిపోయారు.
కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ (Sonia Gandhi) రాజ్యసభకు (Rajya Sabha) వెళ్లడం ఖాయమైంది. ఈసారి ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకున్నారు. వయసురీత్యా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు
Ashok Gehlot: రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ కోవిడ్-19, స్వైన్ ఫ్లూ బారిన పడ్డారు. జ్వరం, తక్కువ ఆక్సిజన్ సాచురేషన్ స్థాయిలు ఉండటంతో జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అచల్ శర్మ శనివారం చెప్పారు.
Jaipur: కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కాటేశాడు. రాజస్థాన్ జైపూర్‌కి చెందిన 16 ఏళ్ల బాలికపై మామ, అతని కొడుకు కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గత మూడు నెలలుగా బాలికపై ఇద్దరూ అత్యాచారానికి పాల్పడుతున్నారని, బాలిక గర్భవతి కావడంతో ఈ విషయం తెలిసిందని పోలీస్ అధికారులు వెల్లడించారు. బాలిక కుటుంబ సభ్యులు ఆమె గర్భంతో ఉందని గుర్తించి, పిండాన్ని తొలగించడానికి ఆస్పత్రికి వెళ్లినప్పుడు ఈ సంఘటన…
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గురువారం సాయంత్రం జైపూర్‌కు చేరుకున్నారు. ఆయనకు జంతర్ మంతర్ వద్ద ప్రధానమంత్రి మోడీ స్వాగతం పలికారు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు మాక్రాన్ కరచాలనం చేసి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. అనంతరం ఇరువురు నేతలు చారిత్రక జంతర్‌మంతర్‌ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. కాగా.. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. రెండ్రోజుల పాటు భారత్ లో పర్యటించనున్నారు.
Republic Day Parade: ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. కాగా, రెండు రోజుల పాటు ఆయన భారత్ లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ మాక్రాన్ భారత్‌కు చేరుకుంటారు. జైపూర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఫ్రాన్స్ అధ్యక్షుడికి భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలకనున్నారు. ఇక, ఆ తర్వాత మోడీతో కలిసి మాక్రాన్ జైపూర్‌లోని పలు పర్యాటక ప్రదేశాలను సందర్శించనున్నారు. Read…
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారుల ముఖ్య సమావేశం జరగబోతోంది. దీంతో జైపూర్‌లో నేటి నుంచి మూడు రోజుల పాటు హై అలర్ట్ ప్రకటించారు. నేటి సాయంత్రం జరిగే డీజీ-ఐజీ సదస్సుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోశాఖ మంత్రి అమిత్ షా జైపూర్ చేరుకోనున్నారు.
Sukhdev Singh Gogamedi: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో ప్రముఖ రాజ్‌పుత్ నాయకుల్లో ఇతను ఒకరు. మంగళవారం జైపూర్‌లోని అతని నివాసంలో కాల్చి చంపబడ్డాడు. రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి తన ఇంటిలో ఉండగా, గుర్తు తెలియని దుండగుడు చొరబడి కాల్పులు జరిపాడు. కాల్పుల్లో గోగమేడితో పాటు అతని ఇద్దరు సహచరులకు బుల్లెట్ గాయాలయ్యాయి.