కేంద్రంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను హిందువునని, హిందువాదిని కాదని అన్నారు. జైపూర్‌లో మెహంగాయ్ హటావో మహార్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. హిందు, హిందూత్వ అనే రెండు పదాల మధ్య దేశ రాజకీయాల్లో ఘర్షణ జరుగుతున్నదని రెండింటి మధ్య చాలా తేడా ఉందని అన్నారు. హిందువు అంటే సత్యం అని, సత్యం కోసం శోధించేవాడని, సత్యాగ్రహం అని, హిందుత్వ అంటే అధికారం…
కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఎన్ని జాగ్రత్తలు పాటించినా నివారణ చర్యలు ఎన్ని తీసుకున్నా దాని పని అది సైలైం ట్‌గా చేసుకుంటూ వెళ్తుంది. తాజాగా జైపూర్‌లోని ఓ పాఠశాలలో 11 మంది విద్యార్థులకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలడంతో ఆపాఠశా లను ప్రభుత్వం మూసివేసింది. కోవిడ్ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి పాఠశాలలను మూసివేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. దాదాపు ఒకటిన్నర సంవత్సరాల విరామం తర్వాత, సెప్టెంబర్ నుం డి రాజస్థాన్‌లో పాఠశాలలు, కళాశాలలు, విద్యా…
ప్రపంచంలో ఎక్కడైనా.. ఎవరికైనా అన్యాయం జరిగినా న్యాయస్థానానికి వెళ్తారు. జడ్జి ఏది చెప్తే అదే వేదం.. కానీ, అలాంటి ఒక న్యాయమూర్తే పాడుపనికి తెగించాడు. ఎంతోమంది నేరస్తులను శిక్షించిన అతను పెద్ద నేరానికి పాల్పడ్డాడు. ఓ న్యాయమూర్తి, ఆయన వద్ద పనిచేసే సిబ్బందితో కలిసి 14 ఏళ్ల బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నెలరోజులు ఈ దాష్టికాన్నీ కొనసాగించారని బాధితుడి తల్లి ఆరోపించింది. ఈ దారుణ ఘటన జైపూర్ లో…
సిటీ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు ఓ ఎంబీఏ గ్రాడ్యుయేట్. లగ్జరీ కార్లను హైటెక్ టెక్నాలజీతో ఎత్తుకెళ్తున్నాడు ఈ ఎంబీఏ విద్యార్థి. జైపూర్ కు చెందిన సత్యేంద్ర సేఖావత్ కోసం సంవత్సరం నుండి గాలిస్తున్నారు సిటీ పోలీసులు. హైదరాబాద్ రాచకొండ పరిధిలో పలు లగ్జరీ కార్లను దోచేసిన సేఖవత్… టెక్నికల్ నాలెడ్జ్ తో సాఫ్ట్వేర్ రూపొందించి కార్లను అపహరిస్తున్నాడు. పార్క్ హయత్ లో ఓ ప్రొడ్యూసర్ కార్ ను దొంగలించాడు సేఖవత్. కేసు నమోదు చేసి జైపూర్ వరకు…
‘మనీ హెయిస్ట్’.. ఎక్కడో స్పెయిన్‌లో తెరకెక్కిన ఈ సిరీస్‌కి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్స్ వున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ వ్యూయర్‌షిప్ ఉన్న సిరీస్ కూడా ఇదే కావటం విశేషం. మనీ హెయిస్ట్ ఇప్పటిదాకా రెండు సీజన్స్.. నాలుగు పార్ట్‌లు.. 31 ఎపిసోడ్స్‌గా టెలికాస్ట్ అయ్యింది. ఇప్పుడు రెండో సీజన్‌లో ఐదో పార్ట్ గా పది ఎపిసోడ్స్‌తో రాబోతోంది. సెప్టెంబర్ 3న ఐదు ఎపిసోడ్స్‌గా రిలీజ్ కానుంది. ఆపై డిసెంబర్‌లో మిగిలిన ఐదు రిలీజ్ అవుతాయి. దీంతో ఎప్పుడెప్పుడు చూసేద్దామా…
ప్రకృతి అంటే ఆమెకు ఎంతో ఇష్టం.. అందుకే తరచూ వివిధ ప్రదేశాలను సందర్శిస్తూ.. ఆ జర్నీలోని అనుభవాలను, అనుభూతులను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది.. కానీ, తాను ట్వీట్ చేసిన అరగంటలోపే ఆ ప్రకృతి ప్రకోపానికే బలిఅవుతానని ఊహించి ఉండదు.. ఇప్పుడా ఘటన సోషల్ మీడియాను షేక్ చేస్తోంది… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఆయుర్వేదిక్ డాక్టర్ దీప శర్మ.. ఈ సృష్టిలోని ప్రకృతి అందాలను చూసి ఎంజాయ్ చేస్తూ వచ్చారు..…
మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్మించిన 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కు అరుదైన ఘనత దక్కింది. జాతీయ స్థాయిలో జైపూర్ ఎస్టీపీపీ ‘బెస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ పెర్ఫార్మర్’ అవార్డు దక్కించుకుంది. జాతీయ స్థాయిలో విద్యుత్ వినియోగం, విద్యుత్ పరిశ్రమల్లో ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం, మొదలైన విషయాలపై మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ అనే ముంబైకి చెందిన సంస్థ శుక్రవారం నిర్వహించిన వీడియో సెమినారులో ఈ అవార్డు ప్రకటించారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ…
పింక్ సిటీగా పేరు తెచ్చుకున్న జైపూర్ నగరానికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఈ నగరంలో 2008, మే 13 వ తేదీన ఉగ్రవాదులు వరస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. నగరంలో జరిగిన వరస బాంబు పేలుళ్లలో 71 మంది మృతి చెందగా, 150 మందికి పైగా గాయపడ్డారు. జైపూర్ సిటీలో 15 నిమిషాల వ్యవధిలో 8 చోట్ల ఈ బాంబు పేలుళ్లు సంభవించాయి. సాయంత్రం సమయంలో ఈ దారుణం చోటు చేసుకోవడంతో మరణాలు అధికంగా సంభవించాయి. జైపూర్ లో…