రాహుల్ గాంధీ కుటుంబం ప్రజలు ఎప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటారని.. అధికారం కోసం అడ్డదారులు తొక్కరని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. జిమ్మిక్కులతో అధికారంలోకి రావాలలనేది మోడీ, అమిత్ షా విధానమని ఆయన విమర్శించారు.
Jagga Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. నువ్వు-నేను ఇద్దరం కలిసి ఆర్టీసీ బస్సు ఎక్కుదాం పదా అంటూ చురకలు అంటించారు.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి బాల్క సుమన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాల్క సుమన్ దగ్గరే చెప్పు ఉందా..? మా మెట్టు సాయి దగ్గర లేదా..? అని తన అనుచరుడి చెప్పు చూపించారు. తెలంగణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి బూటును పైకెత్తి చూపిస్తుండగా.. జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పిలగానివి.. పిలగాని తీరు…
రాహుల్ గాంధీ ప్రజలను సంఘటితం చేసే పనిలో ఉన్నారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. న్యాయమైన పాలన బీజేపీ చేయడం లేదు కాబట్టి రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నారన్నారు. పెరుగుతున్న ధరలకు హద్దు లేకుండా పోయింది మోడీ పాలనలో అని, అస్సాంలో రాహుల్ గాంధీని అడ్డుకోవడం ఎంత వరకు సమంజసం అని ఆయన మండిపడ్డారు. అస్సాం సీఎం హేమంత బిశ్వశర్మ.. ఒకప్పుడు కాంగ్రెస్ గూటి పక్షే అని ఆయన వ్యాఖ్యానించారు. మెప్పుకోసం…
ఆర్టీసీ బస్ ఎక్కి ఫ్రీ టికెట్ పై మహిళలతో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడారు. పటాన్ చెరు నుంచి రుద్రారం వరకు ఆర్టీసీ బస్ లో మహిళలతో ముచ్చటించారు. ఫ్రీ టికెట్ పై మహిళల అభిప్రాయం తెలుసుకున్నారు జగ్గారెడ్డి. టికెట్ లేకుండా ప్రయాణంపై మహిళలు హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. టికెట్ లేని ప్రయాణం అంటే మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు.
సంగారెడ్డిలో ఓటమిపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందించారు. సంగారెడ్డి ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సంగారెడ్డి ప్రజలు తనకు 5 ఏళ్లు విశ్రాంతి ఇచ్చారని.. తనకు ఓట్లు వేసిన 65 వేల మందికి.. అలాగే తనకు ఓట్లు వేయని 71వేల మందికి జగ్గారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సంగారెడ్డి ప్రజలు తనకు కౌన్సిలర్‌గా, మున్సిపల్ ఛైర్మన్‌గా అవకాశం ఇచ్చారన్నారు.
సంగారెడ్డి జిల్లాలో గౌడ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక చెట్టుకి పన్ను రద్దు చేశామని చెప్పారు.
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరు కొనసాగుతోంది. అయితే.. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ఎన్టీవీ నిర్వహిస్తోన్న క్వశ్చన్ అవర్‌లో నేడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డిపై జర్నలిస్టులు breaking news, latest news, telugu news, big news, jaggareddy, congress,
సంగారెడ్డిలో సోమవారం దసరా ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు సీఎం కావాలని కోరిక ఉంది. మీరు ఇలాగే ఆశీర్వదిస్తే ఇంకో పదేళ్లకు నేను తెలంగాణకి సీఎం అయ్యి తీరుతానని జగ్గారెడ్డి అన్నారు. విజయదశమి నాడు నా మనసులో మాట చెబుతున్నానన్నారు.
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ మార్పుపై గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై తాజాగా జగ్గారెడ్డి స్పందించారు. గత ఏడాదిన్నర నుంచి సోషల్ మీడియా ఆనందం ఏందో మరి అర్థం కావడం లేదు.. ఎవరు చేయిస్తున్నారు.. ఎందుకు రాస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యనించారు.