Jagga Reddy: నువ్వు-నేను ఆర్టీసీ బస్సు ఎక్కుదాం.. కిషన్ రెడ్డి పై జగ్గారెడ్డి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagga Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. నువ్వు-నేను ఇద్దరం కలిసి ఆర్టీసీ బస్సు ఎక్కుదాం పదా అంటూ చురకలు అంటించారు. కిషన్ రెడ్డి.. కాంగ్రెస్ ని విమర్శించే ముందు బీజేపీ హామీల గురించి ఆలోచించుకో అని గుర్తుచేశారు. ఏది మాట్లాడాలో..ఏది మాట్లాడకూడదు అనే ఇంగిత జ్ఞానం లేనట్టు అనిపించిందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 నెలలు అయ్యింది.. 20 కోట్ల మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని గుర్తు చేశారు. కిషన్ రెడ్డి.. ఉచిత బస్సు ప్రయాణం నిజం కాదా..? నీ కండ్లకు కనిపించడం లేదా? అని మండిపడ్డారు. ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నీ కండ్లకు కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి.. నీ భార్యను ఆర్టీసీ బస్సు ఎక్కించు అట్లనైన తెలుస్తుందన్నారు. రాష్ట్రంలో ఏమైతుందని తెలుసుకోలేని నువ్వు.. ఏం రాష్ట్ర అధ్యక్షుడువి, నువెం కేంద్ర మంత్రివి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లధనం తెస్తా..పేదల ఎకౌంట్ లో వేస్తా అని మోడీ చెప్పిన మాట గుర్తు లేదా? అని గుర్తు చేశారు.
Read also: Byjus : చెల్లించిన ఫీజు రీఫండ్ చేయకపోవడంతో బైజూస్ ఆఫీసులో టీవీ తీసుకెళ్లిన స్టూడెంట్స్
Also Read
- Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
- Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
- NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
మీ పార్టీనే ఇచ్చిన హామీ అమలుచేయలేదు.. నువ్వు మమ్మల్ని ప్రశ్నించే హక్కునీకు ఎక్కడిది? అని మండిపడ్డారు. 2 కోట్ల ఉద్యోగాలు ఏడాదికి ఇస్తా అన్నావు.. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావో చెప్పి.. మమ్మల్ని అడుగు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను.. నువ్వు ఇద్దరం కలిసి ఆర్టీసీ బస్సు ఎక్కుదాం అన్నారు. సోనియాగాంధీ ఇచ్చిన హామీ అమలు అయ్యిందో లేదో అడుగుదాం.. నువ్వు ధైర్యం చేస్తావా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మీద బురద జల్లాలి అని బీజేపీ చూస్తోందని మండిపడ్డారు. గుర్రం ఎక్కినోడి కథ లెక్క ఉంది కిషన్ రెడ్డి తీరు ఉందని తెలిపారు. మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు.. తర్వాత నీకు సమాధానం చెప్తామన్నారు. కిషన్ రెడ్డి.. ఆగమేఘాల మీద రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు అయ్యాడన్నారు. బండి సంజయ్ ని కారణం లేకుండా ఎందుకు తప్పించారు చెప్పు? అని ప్రశ్నించారు. కేసీఆర్ ని బండి సంజయ్ తిడుతున్నాడు అని.. కేసీఆర్ ప్యాకేజిలో కిషన్ రెడ్డి బీజేపీ ప్రెసిడెంట్ అయ్యాడని తెలిపారు.
Read also: Top Headlines @1PM : టాప్ న్యూస్
ఇది మీ పార్టీ నేతలు అంటున్న మాట అని గుర్తు చేశారు. నీ పార్టీ సంసారమే సక్కగా లేదు.. మా ఇంఛార్జీల గురించి ఎందుకు అని మండిపడ్డారు. ఇంఛార్జి ల మీద మాట్లాడే నైతిక హక్కు మీకు లేదన్నారు. ముందు నీ పార్టీ మీద ఉన్న బురద కడుక్కో కిషన్ రెడ్డి అన్నారు. Nvss mla గా ఓడిపోయి మైండ్ ఖరావ్ అయ్యిందన్నారు. బెంజ్ కారు పెద్ద పనా.. నెలకు లక్ష కడితే బెంజ్ కారు వస్తది అన్నారు. బెంజ్ కారు గిఫ్ట్ అనేది నవ్వులాట అని తెలిపారు. ఏం విమర్శలు చేయాలో కూడా బీజేపీకి తెలియకుండా అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మైండ్ బ్లాక్ అయ్యిందని కీలక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ కి..ఆయన కుర్చీ కాపాడుకునే శక్తే ఆయనకు లేదన్నారు. నీ కుర్చీలో కూసుంటే.. నీకు తెలియకుండానే లాగేశారని అన్నారు. నీకు దానిమీదనే సోయి లేదు.. ప్రజలు కాంగ్రెస్ కి పెట్టిన నోటి కాడి ముద్ద సంగతి ఏం సోయి ఉంది నీకు అని మండిపడ్డారు.
Ranchi Pitch: రాంచీ పిచ్‌ని చూసి షాక్‌కు గురైన బెన్ స్టోక్స్!
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!