బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మెదక్ పార్లమెంట్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుదని తెలిపారు. రాముడు దేవుడు.. కానీ ఆయన్ని ఓ పార్టీకి లీడర్ని చేశారని విమర్శించారు. మెదక్లో ఆ పార్టీ పేరే ఎత్తకండి అని అన్నారు. ఎమోషన్లకు పోయి ఆ పార్టీ వ్యక్తిని గిల్ల వద్దని కార్యకర్తలకు జగ్గారెడ్డి సూచించారు. మెదక్ ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన గడ్డపై మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం అని పేర్కొన్నారు.
Somireddy Chandramohan: మంత్రి కాకాణిపై లోకల్.. నాన్ లోకల్.. అంటున్న సోమిరెడ్డి..!
ఈ సందర్భంగా.. కార్యకర్తల సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ, మెదక్ లో కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం అని అన్నారు. మన అభ్యర్థి నీలం మధు ముదిరాజ్.. అభ్యర్థి బీసీ అయినా అన్ని కులాల మద్దతు అవసరం అని తెలిపారు. మెదక్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ముందుకు సాగి, అభ్యర్థి నీలం మధు గెలుపునకు కృషి చేయాలన్నారు. అన్ని కులాలు, మతాలతో కూడుకున్న సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. సంగారెడ్డిలో తన భార్య నిర్మల పార్టీ కోసం కష్టపడుతుంది.. తాను కూడా బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేస్తానని చెప్పారు.
Vizag: రుషికొండ బీచ్ లో విషాదం.. యువకుడు మృతదేహం లభ్యం
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కే మెదక్ లో పోటీ అని.. మూడో అభ్యర్థి తమకు పోటీనే కాదని జగ్గారెడ్డి చెప్పారు. మొదట ఇది బాగా రెడ్డి నియోజకవర్గం.. తర్వాత ఇందిరమ్మ ఇక్కడి నుండి గెలిచారన్నారు. గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాకలో కూడా పార్టీ పై చేయి సాధించాలని జగ్గారెడ్డి కోరారు.