కొండా సురేఖ ది తప్పే లేదని జగ్గారెడ్డి అన్నారు. కేటీఆర్.. నీ సోషల్ మీడియా తప్పుగా ట్రోల్ చేసిందన్నారు. పదేళ్లు ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్.. పెద్దరికంగా వ్యవహారం ఉండాల్సిందని సూచించారు. మీ సోషల్ మీడియా నీ కంట్రోల్ చేయకపోవడం తప్పన్నారు.
కాంగ్రెస్.. రాహూల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం సీఎం రుణమాఫీ చేశారని.. ఆర్థికంగా ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నా... 31 వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి తీర్మానం చేసి... 18 వేల కోట్లు బ్యాంకుల ఖాతాలో వేశారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.
Jaggareddy: సామాజిక న్యాయం కాంగ్రెస్ తోనే సాధ్యమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. గాంధీ భవన్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి.
సీఎం రేవంత్ రెడ్డి రూ. రెండు లక్షల రుణమాఫీ చేయగానే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇబ్బంది పడుతున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డిని శబాష్ అని మెచ్చుకోలేక టెన్షన్ లో వాళ్ళు ఉన్నారన్నారు.
బీఆర్ఎస్ కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పినందుకు కిషన్ రెడ్డి మాటలు స్వాగతిస్తున్నామని.. అదే జరిగితే సన్మానిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గా రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ ఐనట్టున్నారు.
బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైరయ్యారు. లక్ష్మణ్ పొలిటికల్ చిప్ ఖరాబైందని.. తక్షణమే రిపేర్ చేసుకుని మాట్లాడాలని సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కీలక నేతలు ఆ పార్టీ కి గుడ్ బాయ్ చెబుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో పదవులను అనుభవించిన నేతలు ఇప్పుడు ఊహించని షాక్ ఇచ్చి కాంగ్రెస్, బీజేపీలోకి వెళుతున్నారు.
అసలైన దేశ భక్తుల కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబమేనని.. బీజేపీ నేతలు డూప్లికేట్ దేశభక్తులు అని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వాళ్లు గ్రాఫిక్స్ లీడర్స్ అని ఆయన వ్యాఖ్యానించారు.
Jagga Reddy: ఓడిపోయిన నేను చెప్పులు వేసుకుని తిరుగుతున్న.. నేను గెలవాలని తిరిగిన నా భార్య చెప్పులు వేసుకుని తిరుగుతుంది.. నీకెందుకు అంత బాధ అంటూ సంగారెడ్డిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో అభిమానికి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హితబోధ చేశారు.
బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మెదక్ పార్లమెంట్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుదని తెలిపారు. రాముడు దేవుడు.. కానీ ఆయన్ని ఓ పార్టీకి లీడర్ని చేశారని విమర్శించారు. మెదక్లో ఆ పార్టీ పేరే ఎత్తకండి అని అన్నారు. ఎమోషన్లకు పోయి ఆ పార్టీ వ్యక్తిని గిల్ల వద్దని కార్యకర్తలకు జగ్గారెడ్డి సూచించారు. మెదక్ ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన గడ్డపై మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం అని పేర్కొన్నారు.