ఆర్టీసీ బస్ ఎక్కి ఫ్రీ టికెట్ పై మహిళలతో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడారు. పటాన్ చెరు నుంచి రుద్రారం వరకు ఆర్టీసీ బస్ లో మహిళలతో ముచ్చటించారు. ఫ్రీ టికెట్ పై మహిళల అభిప్రాయం తెలుసుకున్నారు జగ్గారెడ్డి. టికెట్ లేకుండా ప్రయాణంపై మహిళలు హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. టికెట్ లేని ప్రయాణం అంటే మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు.
Read Also: R. Krishnaiah: సీఎం రేవంత్ రెడ్డికి బీసీ సంఘాలు మద్దతు..
ఈ క్రమంలో.. కండక్టర్ తో రోజు అలా ట్రిప్ కి ఎంత మంది మహిళలు జర్నీ చేస్తారని జగ్గారెడ్డి అడిగి తెలుసుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ మాట ఇచ్చిన్నట్లే.. ఈ రోజు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్ లో మహిళలకు టికెట్ లేకుండా ఫ్రీ గా ప్రయాణం మొదలు పెట్టారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే నిలబెట్టుకుంటుందని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీని మీరు జీవితంలో మరువద్దని తెలిపారు. ఇంకా మహిళల కోసం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో చెప్పిన్నట్లే అన్ని పథకాలు అమలు చేస్తారని ఆయన పేర్కొన్నారు. గృహిణి మహిళలకు కూడా త్వరలో 2500 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది.. కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారెంటీలు అమలు చేస్తారని జగ్గారెడ్డి తెలిపారు.
Read Also: TS Ministers: శాఖల కేటాయింపు తర్వాత సచివాలయానికి మంత్రులు భట్టి, పొంగులేటి, జూపల్లి