Jagga Reddy: ఓడిపోయిన నేను చెప్పులు వేసుకుని తిరుగుతున్న.. నేను గెలవాలని తిరిగిన నా భార్య చెప్పులు వేసుకుని తిరుగుతుంది.. నీకెందుకు అంత బాధ అంటూ సంగారెడ్డిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో అభిమానికి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హితబోధ చేశారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంగారెడ్డిలో కార్యకర్తలు కష్టపడ్డ నా టైం బాగలేక సంగారెడ్డిలో నేను ఓడిపోయిన అన్నారు. సంగారెడ్డిలో నేను ఓడిపోయిన మెదక్ పార్లమెంట్ లో మాత్రం కాంగ్రెస్ గెలవాలన్నారు. దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నారు.
Read also: Election Commission: సీఎం జగన్‌పై దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా
జగ్గారెడ్డి మళ్ళీ గెలిచే వరకు చెప్పులు లేకుండా తిరుగుతున్న అంటూ అభిమాని అన్నాడు. దీంతో సంగారెడ్డి మీటింగ్ కి వెళ్లిన జగ్గారెడ్డికి విషయం క్యాడర్ చెప్పడంతో.. జాగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఓడిపోయిన నేను, నా భర్య చెప్పులోసుకుని తిరుగుతున్నా.. నీకెందుకు అంత బాధ అన్నారు. చెప్పులు లేకుండా తిరిగితే ఏదైనా అయితే..నేను ఆసుపత్రి వరకే వస్తా.. డబ్బులు ఇస్తా..నీ వెంట నేను రాను కదా.. అభిమానం మనసులో ఉంచుకోవాలి కానీ ఇలా చేయొద్దు అంటూ జగ్గారెడ్డి హితబోధ చేశారు.
Read also: Vijay Baba Temple : విజయ్ కట్టించిన బాబాను దర్శించుకున్న హీరో లారెన్స్.. వీడియో వైరల్..
అనంతరం మంత్రి కొండా సురేఖ, కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. మహిళలకు 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తారని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు.. మీరు మూడెకరాల భూమి నుంచి మూడు వేల నిరుద్యోగ భృతి వరకు 100 హామీలు ఇచ్చారన్నారు. మాకు ప్రశ్నించే నైతిక హక్కు కేటీఆర్ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇచ్చిన గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తోందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంది.. అందుకే ఫ్రస్టేషన్ లో ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Janhvi Kapoor: అయ్య బాబోయ్.. పాపకి అలా పెళ్లి చేసుకోవాలని ఉందంటా..