రాష్ట్రంలో జగన్ దుర్మార్గమైన పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ప్రధాని మోడీ , హోంమంత్రి అమిత్ షా ల తో కుమ్మక్కై రాష్ట్రాన్ని అదానీ చేతిలో పెట్టారు. అదానీ భార్యకి రాజ్యసభ సీటు ఇచ్చే బదులు పార్టీలో చేర్చుకుంటే బాగుంటుంది. మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ తో జగన్ అభాసు పాలయ్యారు. మంత్రి టెన్త్ పేపర్ లీక్ కాలేదని అంటాడు.. సీఎం ఏమో పేపర్ లీకు అయ్యిందంటాడు.
జగన్ కి నిజంగా దమ్ముంటే ఏపీలో కార్పొరేట్ కాలేజీలు ,స్కూళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలి. ప్రభుత్వంపై నిరసనలు తెలిపితే అరెస్ట్ చేశారు. విజయవాడ నిషేధిత ప్రాంతమా లేకపోతే మేము టెర్రరిస్టులమా? విజయవాడ జగన్ అబ్బ సొత్తా ? ప్రజల్లో జగన్ పాలన పై తీవ్ర అసంతృప్తి ఉంది. ఆర్టీసీ ఛార్జీల పెంపుతో జనంపై 720 కోట్ల భారం పడింది ,కరెంటు ఛార్జీ ల వల్ల రూ.1400 కోట్ల భారం పడింది.
ఆగస్టులో ట్రూ అప్ ఛార్జీల పేరుతో మరో 3 వేల కోట్ల భారం ప్రజలపై వేయనున్నారు. అదానీతో కుమ్మక్కైన జగన్ 7 వేల మెగావాట్ల విద్యుత్ కొంటున్నారు. దీనివల్ల 25 వేల కోట్ల అదనపు భారం ప్రజలపై పడనుంది. బయట విద్యుత్ ఒక యూనిట్ రూపాయి 99 పైసలకు దొరుకుతుంటే జగన్ రెండు రూపాయల 49 పైసలకు యూనిట్ ని కొనుగోలు చేస్తున్నాడు. పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో అన్నిటి మీద పది రూపాయలు అదనంగా ధరలు ఉన్నాయి. జగన్ ప్రజా వ్యతిరేక విధానాలపై 15న విజయవాడలో లో పది వామపక్ష పార్టీలు సమావేశమై భవిష్యత్తు ప్రణాళిక ప్రకటిస్తామన్నారు రామకృష్ణ.
Siddipet:మానవత్వం చాటుకున్న బస్ డిపో మెకానిక్.. సూపర్ వైజర్