రాష్ట్రంలో సామాజిక న్యాయానికి ఆద్యుడు స్వర్గీయ ఎన్టీఆర్ అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. విజయనగరంలో ఆయన చీపురుపల్లిలో మాట్లాడుతూ. రాష్ట్రంలో విధ్వంస పాలన జరుగుతుంది…రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయింది. ప్రభుత్వం చెప్పిన నాడు నేడు ఏమయ్యింది. పదో తరగతిలో ఎందుకు అంతమంది ఫెయిల్ అయ్యారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా తెస్తాం అని జగన్ అన్నారు… ఇప్పుడు మెడలు వంచారు… కాళ్ల బేరానికి వచ్చారని దుయ్యబట్టారు. జగన్ హోదా విషయంలో మెడలు వంచారు. జగన్ చర్యలకు…
ఏపీలో రాజకీయ విమర్శల వేడి రాజుకుంటూనే వుంది. మంత్రులు టీడీపీ నేతలపై తమదైన రీతిలో మండిపడుతూనే వున్నారు. తాజాగా ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలు చూస్తుంటే జాలేస్తోంది. ముఖ్యమంత్రిని తీవ్రవాదిలాగా తయారు అయ్యారంటారు. క్విట్ జగన్ అంటాడు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడి మాటలేనా అవి?? ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నారు మంత్రి అంబటి రాంబాబు. బొబ్బిలి సినిమా గుర్తుకు తెచ్చుకుని ఆవేశం తెచ్చుకోండి అంటున్నాడు…
గుంటూరు జిల్లా మంగళగిరి. 2014 నుంచి మంగళగిరి రాష్ట్రంలో కీలక నియోజకవర్గంగా మారిపోయింది. సీఎం జగన్‌తోపాటు విపక్షనేత చంద్రబాబు కూడా ఇదే నియోజకవర్గంలో నివాసం ఉంటున్నారు. అందుకే మంగళగిరిపై పట్టుకోసం రెండు పార్టీలు వ్యూహాత్మకంగా మందుకెళ్తుంటాయి. 2019లో మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీ చెయ్యడంతో చాలా హైప్ వచ్చింది. ఆ ఎన్నికల్లో లోకేష్ ఓడిపోవడం.. ఆళ్ల రామకృష్ణారెడ్డి వరసగా గెలవడం పెద్ద చర్చకే దారితీసింది. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఇక్కడి నుంచే పోటీ చేస్తానంటున్నారు లోకేష్.…
ఆళ్ల నాని. మొన్నటి వరకు ఏపీ డిప్యూటీ సీఎం. ఏలూరు ఎమ్మెల్యే. సీఎం జగన్‌కు వీర విధేయుడిగా గుర్తింపు ఉంది. మొన్నటి కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో మంత్రి పదవి పోవడంతో కినుక వహించారో ఏమో.. వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడప కార్యక్రమంలో పాల్గొనడం లేదు. ఏలూరులో ఇంత వరకూ ఆ ఊసే లేదన్నది అధికారపార్టీ శ్రేణులు చెప్పేమాట. ఈ రెండేళ్లు జనంలో ఉండాలని.. గ్రాఫ్ పెంచుకోవాలని సీఎం జగన్ సూటిగా సుత్తిలేకుండా చెప్పినా.. ఆళ్ల నానిలో…
ఏపీలో రాజకీయ నాయకుల జీవితాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే కొండా పేరుతో కొండా సురేఖ జీవితాన్ని బయోపిక్ తీస్తున్నారు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఏపీలో మరో రాజకీయ నేత జీవితం తెరకు ఎక్కనుంది. ఆయనే వైసీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్. ఆయన జీవితం ప్రేక్షకుల ముందుకి రానుంది. జగన్ అభిమాని పేరుతో బయోపిక్ రాబోతోంది. ఈ సాయంత్రం పోస్టర్ విడుదల చేశారు ఆ పార్టీ నేతలు. లోకల్ ఫోటో గ్రాఫర్ గా జీవితం ప్రారంభించిన నందిగం…
ఏపీ ప్రభుత్వం రైతులకు అన్నివిధాలుగా సాయం అందించేందుకు సిద్ధంగా వుందన్నారు అగ్రికల్చర్ స్పెషల్ సీఎస్ పూనమ్ మాలకొండయ్య. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ప్రారంభించాం. 26 రకాల పంటలకు బీమా సౌకర్యం ఉందన్నారు పూనం మాలకొండయ్య. పంటల బీమా ప్రక్రియ చాలా పారదర్శకంగా జరిగిందన్నారు. ఈ-క్రాప్ విధానం ద్వారా పంట అంచనా, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. ఐదేళ్లలో రెట్టింపు సంఖ్యలో రైతులకు బీమా సౌకర్యం విస్తరించాం అని చెప్పారు. అన్ని…
కొట్టు సత్యనారాయణ. ఏపీ డిప్యూటీ సీఎం. దేవాదాయశాఖ మంత్రి. గత మూడేళ్ల కాలంలో ఎక్కువగా చర్చల్లో నలిగింది ఈ శాఖే. కొట్టుకు ఆ విషయం తెలియంది కాదు. కానీ.. మంత్రిగారు ఎటుపడితే అటు నాలిక మడత పెట్టేస్తున్నారని సొంత శాఖలోనే సణుగుడు ఎక్కువైంది. దీంతో దేవాదాయశాఖ వర్గాలు.. ప్రభుత్వ పెద్దల్లో చర్చగా మారిపోయారట కొట్టు సత్యనారాయణ. ఇటీవల మంత్రి కొట్టు సత్యనారాయణ కొన్ని కామెంట్స్ చేశారు. ఐదు లక్షల్లోపు ఆదాయం ఉన్న ఆలయాలను అర్చకులకు అప్పజెప్పాలని కోర్టు…
ఏపీలో 2024 కి ముందే ఎన్నికలు రానున్నాయా? వస్తే ఆయా పార్టీల పరిస్థితి ఎలా వుండబోతోంది. పొత్తుల విషయంలో బీజేపీ. టీడీపీ, జనసేన ఏం చేయబోతున్నాయి. ఏపీ పాలిటిక్స్ ని డిసైడ్ చేసే శక్తి పవన్ కళ్యాణ్ లో ఉందా..? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.