Gaganyaan Mission: భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే ప్రతిష్టాత్మక మిషన్ గగన్ యాన్ కౌంట్ డౌన్ స్టార్ అయింది. తొలుత మానవ రహిత విమాన పరీక్షకు సర్వం సిద్ధమైనట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం (అక్టోబర్ 20) తెలిపింది.
2025లో సొంత రాకెట్ తో అంతరిక్షంలోకి తమ వ్యోమగాములను కక్ష్యలోకి తీసుకురావాలని భారత అంతరీక్ష పరీశోధనా సంస్థ యోచిస్తుంది. ఎస్కేప్ సిస్టమ్ ను పరీక్షించడంలో భాగంగా ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్-1(TV D1) ఫ్లైట్ ను రేపు (అక్టోబర్21) ఉదయం 8 గంటలకు నింగిలోకి పంపనున్నారు. నాలుగు టెస్ట్ ఫ్లైట్ లలో ఇది మొదటిది అని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ పేర్కొన్నారు.
Chandrayaan-3: చంద్రయాన్ 3 ప్రజ్ఞాన్ రోవర్ గురించి ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. చంద్రుడి ఉపరితలంపై రోవర్ మళ్లీ యాక్టివ్‌గా మారుతుందన్నారు.
గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించిన సన్నాహాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. మిషన్ సన్నద్ధతను అంచనా వేయడానికి ఈ సమావేశం నిర్వహించబడింది.
అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపేందుకు ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్ మిషన్ కీలక దశకు చేరుకోనుంది. గగన్‌యాన్ మిషన్ కింద అక్టోబర్ 21న టెస్ట్ ఫ్లైట్‌ను ప్రారంభించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సోమవారం ప్రకటించింది.
Chandrayaan-3: అగ్రరాజ్యాల స్పేస్ ఏజెన్సీలు అదిరిపోయేలా చంద్రయాన్-3 మిషన్‌ని విజయవంతం చేసింది ఇస్రో. అంతరిక్ష చరిత్రలో తొలిసారిగా చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్ సాఫ్ట్ ల్యాండింగ్ జరిగింది. అమెరికా, రష్యా,చైనాల తర్వాత చంద్రుడిని చేరిని నాలుగో దేశంగా రికార్డు క్రియేట్ చేసింది. అయితే చంద్రయాన్-3 సమయంలో మన టెక్నాలజీని అమెరికా నాసా నిపుణలు కోరారని ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ చెప్పారు.
Aditya L-1: ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్ 1 సోలార్ మిషన్ అంతరిక్ష నౌక విజయవంతంగా దూసుకుపోతోంది. ఇప్పటికే భూమి గురుత్వాకర్షణ శక్తి నుంచి బయటపడిన ఆదిత్య ఎల్1 లాగ్రేంజ్ పాయింట్(L1) వైపు వెళ్తోంది. అయితే సరైన మార్గంలో ఆదిత్య ఎల్1ని ఉంచేందుకు ఇస్రో కీలక ఆపరేషన్ చేపసట్టింది. స్పెస్ క్రాప్ట్ లోని ఇంజన్లను 16 సెకన్ల పాటు మండించి ట్రాజెక్టరీ కరెక్షన్ మ్యాన్‌యూవర్ (TCM )ను నిర్వహించిందని ఇస్రో ఆదివారం తెలిపింది.
ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) రోజూ 100కి పైగా సైబర్ దాడుల్ని ఎదుర్కొంటోందని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ అన్నారు. కేరళలోని కొచ్చిలో రెండు రోజుల అంతర్జాతీస సైబర్ సదస్సు, కకూన్ 16వ ఎడిషన్ ముగింపు వేడకల్లో శనివారం ఆయన పాల్గొన్నారు. అత్యాధునిక సాఫ్ట్వేర్ ఉపయోగించే రాకెట్ టెక్నాలజీలో సైబర్ దాడులకు అవకాశం చాలా ఎక్కువ అని ఆయన అన్నారు. ఇటువంటి సైబర్ దాడుల్ని ఎదుర్కొనేందుకు బలమైన సైబర్ సెక్యూరిటీని కలిగి ఉన్నామని ఆయన చెప్పారు.
మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలక పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సంబంధించి ఇస్రో కీలక అప్డేట్ ఇచ్చింది.