గత 24 గంటలుగా కొనసాగుతున్న యుద్ధం.. ఎన్ని వందల మంది మరణించారంటే ?
హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతోంది. శనివారం ఉదయం, హమాస్ అనేక ఇజ్రాయెల్ లక్ష్యాలపై 7000 కంటే ఎక్కువ రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడిలో దాదాపు 200 మంది ఇజ్రాయెల్ ప్రజలు మరణించగా 1000 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. హమాస్ ఈ దాడి తర్వాత ఇజ్రాయెల్ కూడా ప్రతీకారం తీర్చుకుంది. ఇజ్రాయెల్ దాడిలో గాజాలో సుమారు 198 మంది మరణించారు. వేలాది మంది ప్రజలు గాయపడ్డారు. ఈ దాడికి హమాస్ ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. గత 24 గంటల్లో ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఏమి జరిగిందో తెలుసుకుందాం?
గాజాను సర్వనాశనం చేస్తాం, ప్రజలు వదిలిపోండి.. ఇజ్రాయిల్ ప్రధాని వార్నింగ్..
ఇజ్రాయిల్‌పై గాజా స్ట్రిప్ నుంచి హమాస్ మిలిటెంట్లు మెరుపుదాడి చేశారు. 5000 రాకెట్లతో ఇజ్రాయిల్ పై విరుచుకుపడ్డారు. ఈ దాడిలో హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పౌరులు, సైన్యాన్ని బందీలుగా పట్టుకుని గాజా నగరానికి తీసుకెళ్లారు .దీనికి సంబంధించిన అనేక వీడియోలు వైరల్ గా మారాయి. మిలిటెంట్లు ఇజ్రాయిల్ సైన్యానికి చెందిన వారిని చంపిన దృశ్యాలు, ఓ మహిళా సైనికురాలిని చంపి నగ్నంగా జీపులో తీసుకెళ్తున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతీకారంతో రగిలిపోతున్నాయి. గాజాపై వైమానిక దాడులు చేస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయిల్ లోకి చొరబడిని మిలిటెంట్లను ఏరిపారేస్తున్నాయి. తాము యుద్ధంలో ఉన్నామని ప్రకటించిన ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ.. ఇజ్రాయిల్ బలగాలు పూర్తి శక్తితో హమాస్‌ని నాశనం చేస్తాయని ప్రతిజ్ఞ చేశారు. హమాస్ అక్రమంగా ఇజ్రాయిల్ భూభాగంలోకిప ప్రవేశించి తమ పౌరులను చంపేసిందని, హమాస్ నిర్దాక్షిణ్యంగా యుద్ధాన్ని ప్రారంభించిదని.. ఈ యుద్ధంలో మేమే గెలుస్తామని, భారీ మూల్యాన్ని హమాస్ చెల్లించుకోవాల్సిందే అని హెచ్చరించారు.
ఆన్‌లైన్ గేమింగ్ పై 28 శాతం జీఎస్‌టీ.. అమలు చేస్తున్నట్లు ప్రకటించిన 18 రాష్ట్రాలు
ఆన్‌లైన్ గేమింగ్, గుర్రపు పందాలు, క్యాసినోలపై 28 శాతం జీఎస్టీ విధించనున్నట్లు ప్రభుత్వం ధృవీకరించింది. ఈ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ చట్టాలు సవరించబడ్డాయి. అక్టోబర్ 1నుండి అమలులోకి వచ్చాయి. జిఎస్‌టి కౌన్సిల్‌లో తీసుకున్న నిర్ణయంపై రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ.. అక్టోబర్ 1నుండి వీటిని ఆమోదించడానికి రాష్ట్రాలు అంగీకరించాయి. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి చట్టం చేయని రాష్ట్రాలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని చెప్పారు.
“ఇజ్రాయిల్‌కి అండగా భారత్” సోషల్ మీడియాలో ట్రెండింగ్..థాంక్స్ తెలిపిన ఇజ్రాయిల్
హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై భీకరదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 200 మంది మరణించినట్లు ఇజ్రాయిల్ ఆర్మీ వెల్లడించింది. మరోవైపు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ గాజాపై వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో వందలకు పైగా పాలస్తీనియన్లు మరణిస్తున్నారు. తాము యుద్ధంలో ఉన్నట్లు ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు ప్రకటించారు. ఇజ్రాయిల్ పౌరులు, సైనికులను బందీలుగా గాజాలోకి తీసుకెళ్లారు హమాస్ మిలిటెంట్లు.
ఇదిలా ఉంటే ఈ దాడిపై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ కి అండగా ఉంటామని ప్రకటించారు. బైడెన్, రిషి సునాక్, మక్రాన్ వంటి ప్రపంచ నేతలు కూడా ఇజ్రాయిల్ కి మద్దతుగా నిలిచారు. ఇజ్రాయిల్ తనను తాను రక్షించుకునే పూర్తి హక్కు ఉందని ప్రపంచదేశాలు నొక్కి చెప్పాయి.
అండమాన్‌లో భూకంపం.. 4.3 తీవ్రతతో ప్రకంపనలు
ఈ రోజు తెల్లవారుజామున అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడిచింది. అండమాన్ సముద్రంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు తెలిపింది. ఆదివారం తెల్లవారుజామున 3.20 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ హెరాత్ ప్రావిన్సులో భారీ భూకంపం సంభవించింది. 6.3 తీవ్రతలో భూకంపం రావడంతో తీవ్ర విషాదం నెలకొంది. కొన్ని గంటల వ్యవధిలోనే ఐదుసార్లు భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి 120 మంది చనిపోగా.. 1000 మందికి పైగా గాయపడ్డారు. ఇంటీరీయర్ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తాలిబాన్ ప్రభుత్వం తెలిపింది. ఈ విపత్తు నుంచి రక్షించాలని ప్రపంచదేశాల సాయాన్ని తాలిబాన్లు కోరారు.
భూకంపంతో వణుకుతున్న ఆఫ్ఘనిస్తాన్.. 320 మంది మృతి
ఆఫ్ఘనిస్థాన్‌లోని పశ్చిమ ప్రాంతంలో ఘోర భూకంపం సంభవించింది. శనివారం సంభవించిన ఈ భూకంపంలో కనీసం 320 మంది మరణించారని, వేలాది మంది గాయపడ్డారని చెబుతున్నారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. భూకంపం ధాటికి చాలా ఇళ్లు కూలిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో ప్రాణనష్టం కూడా జరిగినట్లు సమాచారం. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, ఈ భూకంపం మూలం ఆఫ్ఘనిస్తాన్‌లోని అతిపెద్ద నగరమైన హెరాత్‌కు వాయువ్యంగా 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూకంపం వచ్చిన వెంటనే ఆయా ప్రాంతాల వాసులు ఇళ్లు, దుకాణాలు వదిలి వీధుల్లోకి వచ్చారు. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం, ప్రధాన భూకంపం తర్వాత రిక్టర్ స్కేల్‌పై 5.5, 4.7, 6.3, 5.9 మరియు 4.6 తీవ్రతతో ఐదు భూకంపం సంభవించింది.
ఇస్రోపై రోజుకు 100కు పైగా సైబర్ దాడులు.. ఇస్రో చీఫ్ సోమనాథ్..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) రోజూ 100కి పైగా సైబర్ దాడుల్ని ఎదుర్కొంటోందని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ అన్నారు. కేరళలోని కొచ్చిలో రెండు రోజుల అంతర్జాతీస సైబర్ సదస్సు, కకూన్ 16వ ఎడిషన్ ముగింపు వేడకల్లో శనివారం ఆయన పాల్గొన్నారు. అత్యాధునిక సాఫ్ట్‌వేర్ ఉపయోగించే రాకెట్ టెక్నాలజీలో సైబర్ దాడులకు అవకాశం చాలా ఎక్కువ అని ఆయన అన్నారు. ఇటువంటి సైబర్ దాడుల్ని ఎదుర్కొనేందుకు బలమైన సైబర్ సెక్యూరిటీని కలిగి ఉన్నామని ఆయన చెప్పారు.
సాఫ్ట్‌వేర్‌తో పాటు రాకెట్‌లోని హార్డ్‌వేర్ చిప్‌ల భద్రతపై దృష్టి సారించి వివిధ పరీక్షల్లో ఇస్రో ముందుకు వెళుతోందని ఇస్రో చీఫ్ తెలిపారు. ఇంతకుముందు ఒకే ఉపగ్రహాన్ని పర్యవేక్షించే విధానం. ఒకేసారి అనేక ఉపగ్రహాలను పర్యవేక్షించే సాఫ్ట్‌వేర్ మార్గంగా మార్చబడిందని తెలిపారు.
నేడు టీఎస్‌ఆర్టీసీ కొత్త చైర్మన్‌గా ముత్తిరెడ్డి
నేడు టీఎస్‌ఆర్టీసీ కొత్త చైర్మన్‌గా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. ముత్తిరెడ్డికి ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదు. ప్రస్తుతం ఆయన జనగామ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. అయితే.. ఇప్పటివరకు టీఎస్ ఆర్టీసీ చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి కొనసాగారు. ఆయన స్థానంలో ఇప్పుడు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాధ్యతలు తీసుకోనున్నారు. ముత్తిరెడ్డి టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా రెండు సంవత్సరాలు కొనసాగనున్నారు. అయితే ఇటీవల బీఆర్‌ఎస్ పార్టీలో అసంతృప్తిని చల్లార్చడంపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ దక్కని నేతలను ఛైర్మన్ స్థానాల్లో కూర్చోబెట్టింది. వారికి కీలక బాధ్యతలను అప్పగించింది బీఆర్‌ఎస్ సర్కార్. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రైతుబంధు చైర్మన్‌గా తాటికొండ రాజయ్యను నియమించింది ప్రభుత్వం. ఇక.. రాష్ట్ర ఎంబీసీ చైర్మన్‌గా నందికంటి శ్రీధర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్‌గా ఉప్పల వెంకటేశ్ గుప్తా నియమితులయ్యారు. వీరి నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది.