ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్ యాన్ మిషన్ కౌంట్ డౌన్ ఇవాళ సాయంత్రం షార్ రేంజ్ శ్రీహరికోటలో రాత్రి 7.30 గంటలకు స్టార్ట్ అవుతుంది. 2025లో సొంత రాకెట్ తో అంతరిక్షంలోకి తమ వ్యోమగాములను కక్ష్యలోకి తీసుకురావాలని భారత అంతరీక్ష పరీశోధనా సంస్థ యోచిస్తుంది. ఎస్కేప్ సిస్టమ్ ను పరీక్షించడంలో భాగంగా ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్-1(TV D1) ఫ్లైట్ ను రేపు (అక్టోబర్21) ఉదయం 8 గంటలకు నింగిలోకి పంపనున్నారు. నాలుగు టెస్ట్ ఫ్లైట్ లలో ఇది మొదటిది అని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ పేర్కొన్నారు.
Read Also: Michelle Santner: టీమిండియాను ఎదుర్కొనేందుకు మా ప్లాన్ ఇదే..!
రేపు (శనివారం) ఉదయం 8.00 గంటలకు ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి స్వల్పకాలిక మిషన్ ప్రయోగం జరుగుతుందని.. మొత్తం మిషన్ 531 సెకన్లు (సుమారు 9 నిమిషాలు) సాగుతుందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ వర్గాలు చెప్పుకొచ్చాయి. ఈ ఫ్లైట్ టెస్ట్ మొత్తం గగన్ యాన్ కార్యక్రమంలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుందన్నారు. ఇది అంతరిక్షంలోకి భారతదేశం యొక్క మొట్ట మొదటి మానవ సహిత మిషన్ అని తెలిపారు.
Read Also: Mahua Moitra: “ప్రశ్నకు డబ్బు” కేసులో టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా.. సంచలన ఆరోపణలు..
ఇక, 35 మీటర్ల పొడవు గల లిక్విడ్ ప్రొపెల్డ్ సింగిల్ స్టేజ్ టెస్ట్ వెహికల్ దాదాపు 44 టన్నుల బరువుతో 4వేల 520 కిలోల క్రూ మాడ్యూల్ తో చేసిన వికాస్ ఇంజన్ ను ఉపయోగిస్తున్నారు. దీన్ని అల్యూమినియంతో తయారు చేశారు. దాని ముందు చివర CES అమర్చబడి ఉంటుందన్నారు. ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి లిఫ్ట్ ఆఫ్ అయినప్పటి నుంచి శ్రీహరికోట నుండి 10 కిలో మీటర్ల దూరంలో సముద్రంలో ఉన్న క్రూ మాడ్యూల్ టచ్ డౌన్ వరకు మొత్తం ప్రయోగ క్రమం 531 సెకన్ల పాటు కొనసాగుతుందని ఇస్రో ప్రకటించింది. లిఫ్ట్ ఆఫ్ అయిన 60 సెకన్ల తర్వాత టెస్ట్ వెహికల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్ 11.7 కిలో మీటర్ల ఎత్తులో వేరు చేయబడుతుంది, ఆ తర్వాత మరో 30 సెకన్లకు CM-CES 148.7 వేగంతో 16.7 కిలో మీటర్ల ఎత్తులో సెపరేట్ చేయబడుతుందని తెలిపారు. శ్రీహరికోట నుంచి 10 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో క్రూ మాడ్యూల్ స్ప్లాష్ చేస్తారు.. రికవరీ షిప్ ల ద్వారా భారత నావికాదళం దాన్ని సేకరిస్తుందని చెప్పారు. అయితే, మానవసహిత అంతరిక్ష ప్రయోగాలలో అత్యంత కీలకంగా ఈ ప్రయోగం మారనుంది. శ్రీహరి కోటకు ఇస్తోకు చెందిన సీనియర్ శాస్త్ర వేత్తలు చేరుకున్నారు.