మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలక పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సంబంధించి ఇస్రో కీలక అప్‌డేట్ ఇచ్చింది.
Sikkim Flood: ప్రస్తుతం సిక్కిం అతలాకుతలం అయిపోతుంది. మంగళవారం అర్థరాత్రి ఇక్కడి లొనాక్ సరస్సుపై అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకోవడంతో తీస్తా నదిలో భారీ వరద వచ్చింది. ఈ వరదల్లో ఇప్పటి వరకు 14 మంది చనిపోయారు.
Aditya-L1: భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్ 1 సోలార్ మిషన్ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఆదిత్య ఎల్ 1 అనుకున్నట్లుగానే గమ్యం దిశగా పయణిస్తోంది. తాజాగా భూమి ప్రభావాన్ని తప్పించుకుని ముందుకు సాగుతున్నట్లుగా ఇస్రో వెల్లడించింది. ‘స్పియర్ ఆఫ్ ఎర్త్ ఇన్ఫూయెన్స్’ దాటినట్లుగా తెలిపారు.
చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్‌తో చరిత్ర సృష్టించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో ఇప్పుడు శుక్రుడిపై దృష్టి పెట్టింది.
దేశంలోని రాకెట్లలో ఉపయోగించే 95 శాతం విడిభాగాలు భారత్ నుంచి వచ్చినవేనని ఇస్రో ఛైర్‌పర్సన్ ఎస్.సోమనాథ్ మంగళవారం తెలిపారు. సీఎస్‌ఐఆర్(కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) 82వ స్థాపన దినోత్సవం సందర్భంగా ఇస్రో చీఫ్ ప్రసంగించారు.
అయితే ఇస్రో ఈ రోజు ల్యాండర్, రోవర్ తో సంబంధాలను పునరుద్ధరించేందుకు ఇస్రో ప్రయత్నించింది. అయితే ఇంత వరకు గ్రౌండ్ స్టేషన్ తో సంబంధాలు ఎస్టాబ్లిష్ కాలేదని ఇస్రో తెలిపింది. సంబంధాలు ఏర్పరుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తామని ప్రకటించింది.
చంద్రయాన్ 3పై ఇస్రో ఓ అప్ డేట్ ఇచ్చింది. మిషన్‌లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను స్లీప్ మోడ్ నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ల్యాండర్, రోవర్ నుండి సిగ్నల్ అందలేదని తెలిపింది. ప్రస్తుతం నిద్రాణ స్థితిలో వున్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను మేల్కోలిపే ప్రణాళికలను ఇస్రో రేపటికి వాయిదా వేసింది.
చంద్రయాన్-3 మిషన్‌కు రేపు ముఖ్యమైన రోజు.. చంద్రునిపై 14 రోజుల రాత్రి రేపటితో ముగియనుంది. చంద్రయాన్-3 మిషన్‌లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ స్లీప్ మోడ్ నుండి బయటకు రాబోతున్నాయి. 16 రోజుల పాటు స్లీప్ మోడ్‌లో ఉన్న తర్వాత.. ల్యాండర్, రోవర్‌లను ఇస్రో శుక్రవారం (సెప్టెంబర్ 22) యాక్టివేట్ చేయనుంది.
ఒక బ్లాక్‌బస్టర్ సినిమా నిర్మాణానికయ్యే బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టి అంతరిక్ష ప్రయోగాల్లో భారత కీర్తి పతాకాన్ని ఎగరేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు దండిగా నిధులు కేటాయించి ప్రోత్సహించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర సర్కార్ కు సూచించారు.
Chandrayaan-3: భారతదేశ చరిత్రలో 23 ఆగస్టు 2023 తేదీ సువర్ణాక్షరాలతో లిఖించదగ్గరోజు. రాబోయే తరాలు ఈ తేదీని భారతదేశం శక్తిని గుర్తుంచుకుంటారు. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు చప్పట్లు కొట్టి భారత్ ను ప్రశంసించారు.