Chandrayaan-3: భారత టెక్నాలజీని అమెరికా కోరింది.. ఇస్రో చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrayaan-3: అగ్రరాజ్యాల స్పేస్ ఏజెన్సీలు అదిరిపోయేలా చంద్రయాన్-3 మిషన్‌ని విజయవంతం చేసింది ఇస్రో. అంతరిక్ష చరిత్రలో తొలిసారిగా చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్ సాఫ్ట్ ల్యాండింగ్ జరిగింది. అమెరికా, రష్యా,చైనాల తర్వాత చంద్రుడిని చేరిని నాలుగో దేశంగా రికార్డు క్రియేట్ చేసింది. అయితే చంద్రయాన్-3 సమయంలో మన టెక్నాలజీని అమెరికా నాసా నిపుణలు కోరారని ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ చెప్పారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా డా. ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామేశ్వరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి సోమనాథ్ ప్రసంగించారు.
చంద్రయాన్-3 వ్యోమనౌక అభివృద్ధి కార్యక్రమాలు చూసిన తర్వాత భారత్ తమతో అంతరిక్ష సాంకేతికతను పంచుకోవాలని నాసా- జెట్ ప్రొపెల్షన్ ల్యాబోరెటరీ నిపుణులు కోరారని సోమనాథ్ వెల్లడించారు. నాసా నుంచి చంద్రయాన్-3 పనుల్ని పరిశీలించేందుకు ఆరుగురు నిపుణులు వచ్చారని, వారికి మేము చంద్రయాన్-3ని ఎలా రూపొందించాము, చంద్రుడిపై ఎలా దిగబోతున్నాము అన్ని వివరాలను వివరించామని, వారి నుంచి ‘‘ నో కామెంట్స్.. అంతా బాగానే ఉంటుంది’’ అని అన్నారని ఇస్రో చీఫ్ వెల్లడించారు.
Also Read
- Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
- Punjab: అమృత్‌సర్‌లో దారుణం.. డ్యూటీలో ఉన్న ఏఎస్సైను కాల్చి చంపిన దుండగులు
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
ఇస్రో, భారతీయ శాస్త్రవేత్తలు రూపొందించిన శాస్త్రీయ పరికరాలు చాలా చౌకగా ఉండటంతో పాటు నిర్మించడం సులువు, అదే సమయంలో చాలా హై టెక్నాలజీతో రూపొందించారని, మీరు వీటిని ఎలా నిర్మించారని..? మీరు దీన్ని అమెరికాతో ఎందుకు పంచుకోకూడదని అడిగారని ఆయన చెప్పారు.
ప్రస్తుతం కాలం ఎలా మారిపోయిందో మీరు చూడవచ్చు.. మేము భారత దేశంలోని అత్యుత్తమ పరికరాలు, అత్యుత్తమ రాకెట్లను నిర్మించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నామని, అందుకు మన ప్రధాని మోడీ అంతరిక్ష రంగంలో ప్రైవేటుకు దారులు తెరిచారని చెప్పారు. చెన్నైలోని అగ్నికుల్, హైదరాబాద్ లోని స్కైరూట్ రాకెట్లను నిర్మిస్తోందని, భారతదేశంలోని 5 కంపెనీలు రాకెట్లు, శాటిలైట్లను తయారు చేస్తున్నాయని సోమనాథ్ అన్నారు.
కలలు కనడం అత్యంత శక్తివంతమైన సాధనం, రాత్రిపూట కాకుండా మెలుకువగా ఉన్నప్పుడు కలలు కనాలని అబ్దుల్ కలాం సార్ చెప్పారని, ఎవరికైనా కలులు ఉన్నాయా..? ఎవరైనా చంద్రుడిపైకి వెళ్లాలనుకుంటున్నారా..? పిల్లల్ని ప్రశ్నించారు. చంద్రయాన్-3 ని చంద్రుడిపై ల్యాండ్ చేసిన సమయంలో, ప్రధాని మోడీ మీరు భారతీయులను చంద్రుడిపైకి ఎప్పుడు పంపుతారని అడిగారని తెలిపారు. చంద్రయాన్ -10వ సమయంలో మీలో ఒకరు రాకెట్ లో భారతదేశం నుంచి చంద్రడిపైకి వెళ్తారని, అది ఒక మహిళ కూడా కావచ్చని అన్నారు.
తాజావార్తలు
-
Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
-
Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
-
Trump-Jinping: 24న వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
-
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
-
మార్కులు, డిగ్రీలకు మించి: ‘హ్యూమన్ స్కిల్ పాస్‌పోర్ట్’ను పరిచయం చేస్తున్న HIPSA & Power Sportz
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!