Aditya-L1: సూర్యుడిపై అధ్యయనం చేయడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిని ఆదిత్య ఎల్-1 ప్రయోగం విజయవంతమైంది. 125 రోజలు పాటు అంతరిక్షంలో ప్రయాణించిన ఆదిత్య-L1 ప్రోబ్ విజయవంతంగా తనకు నిర్దేశించిన లాగ్రేజియన్ పాయింట్ 1(L1)లోకి ప్రవేశించింది. 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఎల్1 హాలో కక్ష్యలోకి శాటిలైట్ విజయవంతంగా ప్రవేశించింది.
Isro Chief Somanath: చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతంగా నిర్వహించిన ఇస్రో చీఫ్ శ్రీధర పనికర్ సోమనాథ్‌కు తెలంగాణ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) గౌరవ డాక్టరేట్ ప్రకటించింది.
సాధారణంగా సౌర తుఫానుల నుంచి వెలువడే ఛార్జ్డ్ పార్టికల్స్, ప్రమాదకరమైన తరంగాలు అంతరిక్షంలోని శాటిలైట్స్, భూమిపై ఉన్న పవర్ గ్రిడ్స్‌పై ప్రభావం చూపిస్తాయి. వీటిని ముందుగానే ఆదిత్య-ఎల్1 గుర్తిస్తుంది. దీని వల్ల శాటిలైట్లను రక్షించుకోవచ్చు.
Mission to Space Station: భారత్ మరో అంతరిక్ష కార్యక్రమానికి సిద్ధమవుతోంది. భారత వ్యోమగామిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్ఎస్)కి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా భారత్ వైమానిక దళానికి చెందిన పైలెట్లకు శిక్షణ ఇస్తోంది. నాసా-ఇస్రో మధ్య సహకారంలో భాగంగా పైలట్లకు శిక్షణా కార్యక్రమం జరుగుతోంది. 2024 నాటికి భారత వ్యోమగామిని స్పేస్ స్టేషన్‌కి పంపించాలనే మనదేశం భావిస్తోంది.
Isro Chief Somanath: చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతంగా నిర్వహించిన ఇస్రో చీఫ్ శ్రీధర పనికర్ సోమనాథ్‌కు తెలంగాణ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) గౌరవ డాక్టరేట్ ప్రకటించింది.
ISRO to Launch PSLV-C58 Mission Today: న్యూఇయర్ వేళ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్దమైంది. నేడు పీఎస్‌ఎల్‌వీ-సీ58 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగించనున్న పీఎస్‌ఎల్‌వీ-సీ58కి కౌంట్‌డౌన్ ఆదివారం ఉదయం 8:10 గంటలకు ప్రారంభమవ్వగా.. 25 గంటల కౌంట్‌డౌన్ అనంతరం సోమవారం ఉదయం 9:10 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. పీఎస్‌ఎల్‌వీ-సీ58 ద్వారా మన…
విశ్వంలోని సుదూరాల నుంచి వచ్చే కాస్మిక్ ఎక్స్-తరంగాల ధ్రువణాలను అధ్యయనం చేయడానికి భారత్ తొలిసారిగా ఈ ప్రయోగాన్ని చేపడుతోంది. ఇది అంతరిక్షంలోని బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్‌ని అధ్యయనం చేస్తుంది. విశ్వంలో ఉన్న సమస్యాత్మక రహస్యాలను ఈ ప్రయోగం ద్వారా వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది.
ISRO Begins Countdown for PSLV-C58: 2023లో చంద్రయాన్-3, ఆదిత్య-ఎల్1 మిషన్లను విజయవంతంగా ప్రయోగించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. మరో ప్రయోగానికి సిద్దమైంది. 2024 మొదటి రోజే పీఎస్‌ఎల్‌వీ-సీ58 ప్రయోగం చేపట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక మనదేశానికి చెందిన ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహం (ఎక్స్‌పోశాట్)ను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. సోమవారం ఉదయం 9.10 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో ప్రయోగానికి సంబంధించి కౌంట్‌డౌన్‌ను ఇస్రో…