India vs Pakistan: వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అత్యంత ప్రతిష్టాత్మక మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. శనివారం జరిగిన ఈ మ్యాచులో పాకిస్తాన్ ను భారత్ చిత్తుచిత్తుగా ఓడించింది. ఏ దశలోనూ భారత్ జట్టుకు పోటీగా నిలబడలేదు. ఐసీసీ ఈవెంట్లలో మరోసారి భారత్ చేతిలో 8వసారి ఓడిపోయింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచులో ఓ అభిమాని ఇజ్రాయిల్ కి మద్దతుగా పోస్టర్లను ప్రదర్శించారు.
Israel-Hamas War: పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులను పూర్తిగా తుడిచిపెట్టేందుకు ఇజ్రాయిల్ బలగాలు సిద్ధమవుతున్నాయి. శనివారం పదాతిదళాలను కలిసిన ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ.. రెండో దశకు సిద్ధంగా ఉన్నారా..? అంటూ ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై భీకరదాడికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Israel: ఇజ్రాయిల్ ఢిపెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) గాజాలోని హమాస్ పై ప్రతీకార దాడులు చేస్తోంది. గత శనివారం హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై క్రూరమైన దాడిని చేశాయి. ఆ దాడిలో 1300 మంది ఇజ్రాయిలీలు చనిపోగా.. పలువరిని బందీలుగా చేసుకున్న హమాస్ ఉగ్రవాదులు వారిని గాజాలోకి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ వైమానికి దళం గాజా స్ట్రిప్ పై నిప్పుల వర్షాన్ని కురిపిస్తోంది.
Israel-Hamas War: హమాస్ ఉగ్రవాదుల నుంచి ఇజ్రాయిల్ క్రూరమైన దాడిని ఎదుర్కొంది. గాజా నుంచి వచ్చి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ భూభాగంలోకొ చొరబడి సాధారణ ప్రజానీకంపై దారుణాలకు ఒడిగట్టారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దొరికిన వాళ్లను దొరికినట్లు హతమార్చారు. మహిళపై హత్యాచారాలకు ఒడిగట్టారు. రోడ్లపై వెళ్తున్న కార్లను షూట్ చేశారు. కార్ల పెట్రోల్ ట్యాంకులను, ఇంజన్ల టార్గెట్ చేసి, అవి ఆగిపోయిన తర్వాత నిస్సాయకంగా ఉన్న వ్యక్తుల్ని కాల్చి చంపారు.
IMEEC: ఇజ్రాయిల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడి యుద్ధానికి దారి తీసింది. ముందు హమాస్ మొదలు పెడితే, ఇప్పుడు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ పాలస్తీనా గాజా ప్రాంతంలోని హమాస్ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఈ యుద్ధం రెండు కీలక ఒప్పందాలను ప్రభావితం చేస్తోంది. ఇజ్రాయిల్-అమెరికా-సౌదీ అరేబియా మధ్య ఒప్పందాన్ని ప్రభావితం చేసింది. అరబ్ దేశాలతో ఇజ్రాయిల్ మధ్య సత్సంబంధాలు ఏర్పాటు చేయాలనే అమెరికా లక్ష్యాన్ని ఈ యుద్ధం దెబ్బతీసింది. ప్రస్తుతానికి ఈ ఒప్పందానికి సౌదీ బ్రేక్ వేసింది.
Israel-Hamas War: గత శనివారం ఇజ్రాయిల్‌పై క్రూరమైన మారణకాండకు నాయకత్వం వహించిన హమాస్ ఉగ్రసంస్థ కమాండర్‌ని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) హతమార్చాయి. డ్రోన్ దాడిలో టాప్ కమాండర అలీ ఖాదీని డ్రోన్ దాడిలో చంపినట్లు శనివారం ఐడీఎఫ్ ప్రకటించింది. ఇతను హమాస్ అత్యంత ముఖ్యమైన ఎలైట్ గ్రూప్ ‘నుఖ్బా’ ఫోర్సుకి చీఫ్‌గా వ్యవహరిస్తున్నాడు. అక్టోబర్ 7న గాజా నుంచి ఇజ్రాయిల్ భూభాగంలోకి ప్రవేశించిన ఉగ్రవాద బృందానికి అలీ ఖాదీ చీఫ్.
Putin: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం భీకరంగా సాగుతోంది. గత శనివారం ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 1300 మంది చనిపోయారు. ప్రతీకారేచ్ఛతో ఉన్న ఇజ్రాయిల్, గాజాలోని హమాస్ స్థావరాలపై విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో గాజాస్ట్రిప్ లోని వేల మంది మరణిస్తున్నారు. గాజాలో హమాస్ చెరలో ఉన్న బందీలుగా ఉన్న తమవారిని రెస్క్యూ చేసేందుకు ఇజ్రాయిల్ ప్రయత్నిస్తోంది.
ఇదిలా ఉంటే సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న వేళ, హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ నుంచి బందీలుగా పట్టుకున్న చిన్న పిల్లల్ని ఆడిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. సాయుధులైన ఉగ్రవాదులు ఓ చేతిలో గన్స్, మరో చేతిలో పిల్లల్ని ఎత్తుకుని ఆడిస్తున్నారు. ఈ వీడియోను టెలిగ్రామ్ ఛానెల్ లో ప్రసారం చేశారు.
France: ఉత్తర ఫ్రాన్స్‌లోని అరాస్ స్కూల్ లో శుక్రవారం కత్తి దాడి జరిగింది. ఈ దాడిలో ఫ్రెంచ్ భాషా ఉపాధ్యాయుడు మరణించాడు. అయితే ఈ ఘటన ఫ్రాన్స్ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించింది. దాడి చేసిన వ్యక్తి మతపరమైన నినాదాలు చేస్తూ దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. 20 ఏళ్ల టీచర్ని దారుణంగా పొడిచి చంపాడు, మరో ఇద్దర్ని నిందితుడు గాయపరిచాడు. ఈ ఘటనపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘అనాగరికి…
Hamas: ఇజ్రాయిల్-హమాస్ యుద్దంలో ఇజ్రాయిల్ సైన్యానికి కీలక విజయం లభించింది. హమాస్ ఉగ్ర సంస్థ వైమానిక దళాల అధిపతి మరణించినట్లుగా ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) వెల్లడించింది. గాజా స్ట్రిప్ లో రాత్రిపూట జరిగిన వైమానిక దాడిలో కీలక హమాస్ నేత మరణించినట్లు తెలిపింది.