Israel-Hamas War: గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయిల్ యుద్ధ ట్యాంకులు.. భూతల దాడికి అంతా సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: అక్టోబర్ 7 హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై క్రూరమైన దాడిని చేశారు. ఈ దాడిలో 1400 మంది ఇజ్రాయిలీలు మరణించారు. 200 మందికి పైగా సాధారణ ప్రజలను బందీలుగా పట్టుకుని గాజాకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఇజ్రాయిల్, గాజాపై వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో 6500 మంది మరణించారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు వైమానిక దాడులకు పరిమితమైన ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ఇప్పుడు భూతల దాడులకు సిద్ధమవుతున్నాయి. గాజా ఆక్రమణ కోసం ఐడీఎఫ్ బలగాలు ఎదురుచూస్తున్నాయి.
Read Also: Maharashtra : మహారాష్ట్రలో దారుణం.. అన్నం పెట్టలేదని తల్లిని చంపిన కొడుకు
Also Read
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ఈనేపథ్యంలోనే హమాస్ నియంత్రణలో ఉన్న గాజాలోకి ఇజ్రాయిల్ యుద్ధ ట్యాంకులతో ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ట్యాంకులు, పదాతి దళం రాత్రిపూట దాడి చేశాయని ఇజ్రాయిల్ తెలిపింది. ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహూ భూతల దాడులకు సన్నాహాలు జరుగుతున్నాయని ప్రకటించిన కొన్ని గంటల్లోనే పాలస్తీనా భూభాగమైన గాజాలోకి ఇజ్రాయిల్ బలగాలు చొచ్చుకెళ్లాయి.ఈ ఆపరేషన్‌ని ‘‘టార్గెటెడ్ రైడ్స్’’గా ఇజ్రాయిల్ అభివర్ణించింది. ఉగ్రవాద మౌళిక సదుపాయాలు, యాంటీ ట్యాంక్ క్షిపణి పోస్టులపై దాడులు చేసినట్లు తెలిపింది. ఇది పోరాటం యొక్క తదుపరి దశలకు సన్నాహాలని పేర్కొంది. ట్యాంకులతో గాజాలోకి వెళ్లిన ఇజ్రాయిల్ బలగాలు మళ్లీ ఇజ్రాయిల్ భూభాగానికి తిరిగి వచ్చారు.
ఐడీఎఫ్ పోస్టు చేసిన వీడియోలో సరిహద్దు కంచెను దాటుతున్న వాహనాలు, బుల్డోజర్లను చూపించింది. ముఖ్యంగా ఉత్తర గాజాను ఇజ్రాయిల్ టార్గెట్ చేసింది. ఇప్పటికే ఇజ్రాయిల్, గాజాలోని ఉత్తర ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించింది. ఒక మిలియన్ జనాభా ఉన్న ఉత్తర గాజా నుంచి ఇప్పటికే చాలా మంది దక్షిణ గాజాకు వెళ్లారు. మరోవైపు అమెరికా, ఇజ్రాయిల్ కు చెప్పడంతోనే ఇన్ని రోజులుగా గాజాపై ఆక్రమనను ఇజ్రాయిల్ ఆలస్యం చేస్తూ వస్తోంది. హమాస్‌ని పూర్తిగా నిర్వీర్యం చేస్తామని ప్రకటించిన ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ ప్రస్తుతం ఎవరి మాట వినే స్థితిలో లేరు. హమాస్ అంతాన్ని ఆయన కోరుకుంటున్నారు. మరోవైపు అరబ్ ప్రపంచం, ముస్లిం దేశాలు కాల్పుల విరమణ పాటించాలని, అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని కోరుతోంది.
In preparation for the next stages of combat, the IDF operated in northern Gaza.
IDF tanks & infantry struck numerous terrorist cells, infrastructure and anti-tank missile launch posts.
The soldiers have since exited the area and returned to Israeli territory. pic.twitter.com/oMdSDR84rU
— Israel Defense Forces (@IDF) October 26, 2023
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!