Operation Ajay: పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ చేసిన భయంకరమైన దాడి తరువాత, ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న ప్రాంతం నుంచి 286మంది భారతీయ పౌరులు స్వదేశానికి తిరిగి వచ్చారు.
Israel Hamas War: గత పది రోజులుగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు మరింత ఉగ్రరూపం దాల్చింది. ఇంతలో ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని ఆసుపత్రిపై వైమానిక దాడి చేసింది.
హమాస్‌లోని ఉగ్రవాద శక్తులను నాశనం చేసేందుకు ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న దాడుల నేపథ్యంలో భారీ ప్రాణనష్టం జరుగుతోంది.
ఇజ్రాయెల్ ముట్టడి కారణంగా గాజా స్ట్రిప్‌లో ఆహార పరిస్థితి మరింత దిగజారిపోతోందని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ) మంగళవారం తెలిపింది. గాజా సరిహద్దును త్వరగా తెరవకపోతే, ఇజ్రాయెల్ కళ్లకు గంతలుగా మారిన ఈ ప్రాంతంలో ఆకలితో అలమటించే పరిస్థితి ఏర్పడుతుంది.
హమాస్ లక్ష్యాలపై ఇజ్రాయెల్ నిరంతరాయంగా దాడులు చేయడంతో తీవ్రవాద సంస్థ ఉలిక్కిపడినట్లు తెలుస్తోంది. అక్టోబరు 7 నుంచి జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో తొలిసారిగా హమాస్ ఓ వీడియోను విడుదల చేసింది. బాంబు దాడిని ఆపాలనే ఉద్దేశంతో బ్లాక్ మెయిల్ చేయడం కోసం హమాస్ ఈ వీడియోను రూపొందించింది.
Israel-Hamas War: అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై హమాస్ జరిపిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ వైమానికదళం గాజా స్ట్రిప్‌పై నిప్పుల వర్షం కురిపిస్తోంది. హమాస్ ఉగ్ర స్థావరాలతో పాటు ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం ఉన్న అన్ని ప్రాంతాలు, బిల్డింగులపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్, పాలస్తీనాలోని గాజాపై భూతల దాడులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే గాజా ఉత్తర ప్రాంతంలోని పాలస్తీయన్లు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశించింది ఇజ్రాయిల్ ఆర్మీ.
Israel-Hamas War: అక్టోబర్ 7నాడు ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడిని ఇజ్రాయిల్ మరిచిపోలేకపోతోంది. ఇజ్రాయిల్ ఏర్పడినప్పటి నుంచి ఇలాంటి దాడిని ఎప్పుడూ చూడలేదు. మెస్సాద్ వంటి గూఢాచర సంస్థ, పటిష్ట ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నప్పటికీ దాడిని ముందుగా పసిగట్టలేకపోయింది.
Israel-Hamas War: హమాస్ చేసిన తప్పులకు గాజా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. దొరికినవారిని దొరికినట్లు దారుణంగా చంపేశారు. ఆడవాళ్లపై అత్యాచారాలకు తెగబడంతో పాటు అభంశుభం తెలియని చిన్నారులను తలలు నరికి చంపారు. ఈ దాడుల్లో ఇజ్రాయిల్ వైపు 1300 మంది ప్రజలు మరణించారు. ఈ దాడితో తీవ్ర ప్రతీకారేచ్ఛతో ఇజ్రాయిల్ రగిలిపోతోంది. గాజాపై నిప్పుల వర్షం కురిపిస్తోంది.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం భీకరంగా సాగుతోంది. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ లో జరిగిన క్రూరమైన హత్యలకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) బలగాలు వైమానిక దాడులు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే భూతల దాడులు నిర్వహించేందుకు సైన్యం సిద్ధమైంది. పాలస్తీనా ప్రజలు గాజా ఉత్తర ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని ఇప్పటికే ఐడీఎఫ్ హెచ్చరించింది.
Israel: ఇజ్రాయిల్‌పై దాడికి తెగబడిన ఒక్కో హమాస్ కీలక నేతల్ని ఇజ్రాయిల్ ఆర్మీ హతం చేస్తోంది. ఇప్పటికే పలువురు కీలక ఉగ్రవాదులు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) దాడుల్లో హతమయ్యారు. ఇందులో హమాస్ ఎలైట్ గ్రూప్ ‘నుఖ్బా ఫోర్స్’ అల్ కేద్రాను హతమార్చినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. మిగతా హమాస్ ఉగ్రవాదులందరికీ ఇదే గతి పడుతుందని ఐడీఎఫ్ హెచ్చరించింది. ఇప్పటికే హమాస్ వైమానికి దళానికి చీఫ్ గా ఉన్న మరో ఉగ్రవాది మురాద్ అబు మురాద్‌ని హతం చేసినట్లు టైమ్స్…