USA: హమాస్, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ మెంబర్స్‌పై అమెరికా ఆంక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA: ఇరాన్ లోని హమాస్ అధికారి, ఇరాన్ లోని రివల్యూషనరీ గార్డ్ సభ్యులతో సహా ఇటీవల ఇజ్రాయిల్ పై దాడికి తెగబడిన పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్‌పై అమెరికా రెండో రౌండ్ ఆంక్షలు విధించింది. హమాస్ ఇన్వెస్టిమెంట్ ఫోర్ట్‌ఫోలియోలోని ఆదనపు ఆస్తులను లక్ష్యంగా చేసుకుని, హమాస్ అనుబంధ కంపెనీలపై ఆంక్షల ఎగవేతను సులభతరం చేసే వ్యక్తులపై ఆంక్షలు విధించినట్లు యూఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇరాన్ హమాస్ తో పాటు లెబనాన్ లోని హిజ్బుల్లా మిలిటెంట్లకు సాయం చేస్తుందని ఇజ్రాయిల్, అమెరికా ఆరోపిస్తున్నాయి.
Read Also: Qatar: 8 మంది భారతీయులకు మరణశిక్ష.. ఇజ్రాయిల్ కోసం గూఢచర్యమే కారణం..?
Also Read
- Israel Elections: ఇజ్రాయెల్‌లో నేడు సార్వత్రిక ఎన్నికల పోలింగ్.. నెతన్యాహు పీఠానికి ముప్పు?
- దొంగచాటుగా ఓటర్ల డేటాను యాక్సెస్ చేసిన Anthropic Claude AI.. ప్రభుత్వ డేటాబేస్‌ల భద్రతపై కొత్త ప్రశ్నలు..
- China: సినిమా హీరోలా? సైన్స్ వీరులా? ప్రపంచానికి కళ్లు తెరిపించిన చైనా
- US, Russia and Ukraine Talks: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు? నవంబర్‌లో కీలక త్రైపాక్షిక చర్చలు!
హమాస్, పాలస్తీన ఇస్లామిక్ జిహార్ గ్రూపులకు అక్రమ ఇరానియన్ నిధులకు మధ్యవర్తిగా పనిచేసిన గాజాలోని ఓ సంస్థను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు యూఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ తెలిపింది. హమాస్ ఆర్థిక కార్యకలాపాలు, నిధుల ప్రవాహాలను అడ్డుకోవడంతో పాటు హమాస్ వంటి ఉగ్రవాద సంస్థల బలాన్ని తగ్గించేందుకు వెనకాబోమని డిప్యూటీ ట్రెజరీ సెక్రటరీ వాలీ అడెయెమో అన్నారు.
అక్టోబర్ 7న ఇజ్రాయిల్ పై హమాస్ మిలిటెంట్ సంస్థ తీవ్రమైన దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 1400 మంది ఇజ్రాయిలీలు చనిపోగా.. 200కు పైగా ప్రజల్ని బందీలుగా చేసుకున్న ఉగ్రవాదులు గాజాలోకి తరలించారు. చనిపోయిన వారిలో చిన్నపిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై భీకరంగా వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 7000 కన్నా ఎక్కు వ మంది పాలస్తీనియన్లు చనిపోయారు.
- Tags
- Hamas
- Iran
- Israel
- Israel-Hamas War
- USA
తాజావార్తలు
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
-
Hyderabad: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య..
-
Sigma OTT: అప్పుడే ఓటీటీలోకి ‘సిగ్మా’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
ట్రెండింగ్
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
-
Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!