Qatar: ఖతార్ దేశంలో 8 మంది భారతీయ మాజీ నేవీ అధికారులకు అక్కడి కోర్టు ఉరిశిక్ష విధించింది. గతేడాది ఆగస్టులో వీరిని అరెస్ట్ చేసి, ఎలాంటి వివరాలు వెల్లడించకుండా ఉరిశిక్ష విధించడంపై భారత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఖతార్ లోని సాయుధ బలగాలకు శిక్షణ, ఇతర సహాయ సహకారాలు అందించే దహ్ర గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లో పనిచేస్తున్నారు. అయితే ఈ కేసులో ఈ సంస్థ యజమానిని అరెస్ట్ చేసిందా, కొన్ని రోజులకే క్షమాభిక్షపై వదిలేసింది. కానీ 8 మంది భారతీయులకు మాత్రం శిక్ష విధించడం అనుమానాలకు తావిస్తోంది. ఇజ్రాయిల్ తరుపున ఖతార్ దేశంలో భారతీయులు గూఢచర్యం చేయాల్సిన అవసరం ఏముంటుందనే అంతర్జాతీయ సంబంధాల నిపుణులు చెబుతున్నారు. ఖతార్ లో పాలన, పోలీస్, కోర్టులు అన్నీ కూడా రాచకుటుంబం ఆధీనంలోనే ఉండటం వల్ల సాక్ష్యాలకు విలువ లేకుండా పోయిందనే వాదనలు ఉన్నాయి.
పాకిస్తాన్-ఖతార్ దేశాల కుట్ర..?
భారత నావీ మాజీ అధికారులను కుట్ర ప్రకారమే పాకిస్తాన్-ఖతార్ కలిసి ఇరికించినట్లు తెలుస్తోంది. పాక్ ఆర్మీ, ఐఎస్ఐ కావాలనే ఫేక్ సమాచారాన్ని సృష్టించి వీరిని ఈ కేసులో ఇరికించిందని అనుమానిస్తున్నారు. గత ఏడాది పాక్ ఆర్మీ అధికారులు, ఖతార్ లోని ఉన్నతాధికారులతో పలుమార్లు సమావేశం నిర్వహించారు. ఇందులో ఒకరు తీర్పును ప్రకటించడానికి కొద్ది రోజుల ముందే వచ్చారు. దీంతో ఈ అంశంలో పాక్ ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది.
అక్టోబర్ 12న ఇస్లామాబాద్ లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్ ఖతార్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ సేలం బిన్ హమద్ అల్ నబిత్ ని కలిశారు. రక్షణ సంబంధాలు పటిష్టం చేసుకోవడంపై చర్చించినట్లు చెబుతున్నప్పటికీ, భారతీయులపై కుట్ర చేసేందుకే సమావేశమయ్యారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఓ జలంతర్గామి కార్యక్రమంపై ఇజ్రాయిల్ తరుపున గూఢచర్యం చేశారనే ఆరోపణలు వచ్చినప్పటికీ.. వారికి వ్యతిరేకంగా ఎటువంటి ఖచ్చితమైన సాక్ష్యం సమర్పించబడలేదు.
Read Also: Pune: హాట్ కేకుల్లా అపార్ట్మెంట్లు.. కొనేందుకు 8 గంటల పాటు క్యూలో పడిగాపులు.. వీడియో వైరల్..
భారత్ అంటే పాక్, ఖతార్ ఇద్దరికి ద్వేషమే..
ఇతర అరబ్, ముస్లిం దేశాలతో పోలిస్తే పాకిస్తాన్ ప్రభావం ఖతార్ పై ఎక్కువ. చాలా విషయాలపై పాక్ తో పాటు ఖతార్ భారత్ ను వ్యతిరేకిస్తుంటాయి. మరోవైపు సౌదీ అరేబియా, యూఏఈ లాంటి అగ్రగామి గల్ఫ్ కంట్రీలతో భారత్ స్నేహ సంబంధాలు బలపడటం ఈ రెండు దేశాలకు పెద్దగా నచ్చడం లేదు. ఖతార్ ఆ ప్రాంతంలో సౌదీని కాదని నాయకత్వం చేపట్టాలని ఉవ్విళ్లూరుతోంది. తాలిబాన్, తాజాగా హమాస్ వంటి సమస్యల్లో ఖతార్ కీలక పాత్ర పోషించింది. ఇలా పెద్దన్న కావాలనే ఆలోచనలో ఉంది.
పాక్ తో పోలిస్తే ఖతార్ కాశ్మీర్ అంశాన్ని పలు వేదికలపై చర్చించింది. ఇక ఖతార్ సాయుధ బలగాల్లో రిటైర్డ్ అయిన పాకిస్తాన్ సైనికులే ఉంటున్నారు. దీంతో ఆ దేశంపై పాకిస్తాన్ ప్రభావం ఉంది. ఇటీవల కాలంలో ఖతార్ ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచ కప్ నిర్వహించింది. ఈ ఈవెంట్ కి రక్షణ బాధ్యతలను పాక్ ఆర్మీనే చూసింది. ఈ వేడకలకు ముందు భారత్ ఉగ్రవాదిగా గుర్తించిన జకీర్ నాయక్ కి ఖతార్ ప్రభుత్వం గ్రాండ్ వెల్కమ్ చెప్పింది.
వాణిజ్యం కూడా కారణమా..?
ఖతార్ సీఎన్‌జీ ప్రొడక్షన్‌ని పెద్ద ఎత్తున చేస్తోంది. అయితే భారత్ ఖతార్ నుంచి 7-8 ఏళ్లకు సీఎన్‌జీ కొనుగోలుకు చేసేందుకు ఒప్పందం చేసుకుంది, అయతే ఖతార్ మాత్రం 20 ఏళ్ల వరకు ఒప్పందం చేసుకోవాలని భారత్ ని కోరుతుంది. అయితే భారత్ ఒక ఖతార్ నుంచే కాకుండా ఆఫ్రికా దేశం మొజాంబిక్ దేశాలు, ఇతర ఆఫ్రికా దేశాల నుంచి ఒప్పందం చేసుకుంది. అయితే ఇలా భారతీయులకు శిక్ష విధించి, భారత్ పై ఒత్తిడి తేవాలని ప్రయత్నిస్తుందనే వాదన కూడా వినిపిస్తోంది.