Tower Semiconductor: భారతదేశం సెమీకండక్టర్ తయారీ పరిశ్రమల్లో పురోగమించాలనే ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యానికి అనుగుణంగా పలు దిగ్గజ సెమీకండక్టర్ కంపెనీలు ఇండియాలో తన ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. ఇప్పటికే యూఎస్ చిప్ మేకర్ మైక్రాన్ టెక్నాలజీ గుజరాత్లో అసెంబ్లీ, టెస్ట్ ఫెసిలిటీని స్థాపించడానికి 825 మిలియన్ల పెట్టుబడిని ప్రకటించింది. ఫేజ్-1, ఫేజ్-2లుగా ఈ సంస్థ ప్లాంట్ సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి మైక్రాన్ తన తొలి చిప్ విడుదల చేస్తుందని…
Gaza War: హమాస్ అంతాన్ని చూసే దాకా ఇజ్రాయిల్ గాజాలో యుద్ధాన్ని ఆపేలా కనిపించడం లేదు. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని చంపేశారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ పాలస్తీనా భూభాగాలైన గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్‌పై విరుచుకుపడుతోంది. హమాస్ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. హమాస్ అంతమయ్యేదాకా యుద్ధాన్ని విరమించేంది లేదని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ పలు సందర్భాల్లో వెల్లడించారు.
Israel Air Strike : గాజా స్ట్రిప్‌లోని రఫాలో రాత్రిపూట ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 13 మంది మరణించారు. హమాస్ కాల్పుల విరమణ నిబంధనలను ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించిన కొన్ని గంటల తర్వాత ఈ దాడులు జరిగాయి.
ఇజ్రాయెల్-హమాస్‌ల (israel hamas) మధ్య గత కొంత కాలంగా జరుగుతున్న యుద్ధంతో రక్తపుటేరులు పారుతున్నాయి. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. ఇంకొందరు చావుబతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా రష్యా- ఉక్రెయిన్, ఇజ్రాయెల్- హమాస్ దేశాల మధ్య యుద్ధం బీభత్సంగా కొనసాగుతుంది. ఈ యుద్ధంలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరగడం వల్ల సదరు దేశాలపై ఆర్థిక భారం పెరుగిపోతుంది.
గాజాలో కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ వివాదం మధ్య ఇజ్రాయెల్ దళాల తాజా వ్యూహాలు బయటపడ్డాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ రహస్య కార్యాచరణ ప్రణాళికలో భాగంగా.. దాని దళాలు పౌరులు, వైద్య సిబ్బంది వేషధారణలో ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలోని ఆసుపత్రిలోకి చొరబడి ముగ్గురు హమాస్ మిలిటెంట్లను హతమార్చారు.
Iran: ఇరాన్ తన ప్రధాన శత్రువు ఇజ్రాయిల్ కోసం గూఢచర్యానికి పాల్పడుతున్న నలుగురుకి ఉరిశిక్ష విధించింది. దోషులుగా తేలడంతో వారిని సోమవారం తెల్లవారుజామున ఉరితీసినట్లు టెహ్రాన్ న్యాయవ్యవస్థ తెలిపింది.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ మధ్య జరుగుతున్న గాజా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు వర్గాలు మరోసారి సంధికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పారిస్ వేదికగా ఈజిప్ట్, ఖతార్, ఇజ్రాయి్ల ఉన్నతాధికారులు భేటీ అయినట్లు సమచారం. ఈ యుద్ధం వల్ల ప్రపంచశాంతికి భంగం కలుగుతోందని అన్ని దేశాలు భావిస్తున్నాయి. ఇప్పటికే పలు వెస్ట్రన్ దేశాలు యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయిల్‌ని కోరుతున్నాయి. మరోవైపు హమాస్ పూర్తిగా అంతమయ్యే వరకు యుద్ధాన్ని విరమించే ప్రసక్తే లేదని ఆ దేశ ప్రధాని…
Google: ఇజ్రాయెల్ టెక్ సంస్థలు, పాలస్తీనా వ్యాపారాలకు మద్దతుగా Google $8 మిలియన్లు పెట్టుబడి పెడుతోంది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ సమయంలో ఫైనాన్సింగ్‌ను పొందేందుకు చిన్న కంపెనీల అవసరాన్ని పేర్కొంటూ ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని గ్రూప్ బుధవారం తెలిపింది.
ఇజ్రాయెల్- హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇప్పుడు కొన్ని రోజులు విరామం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ మేరకు ఇజ్రాయెల్ హమాస్‌కు ఒక ప్రతిపాదనను పంపింది. అందులో 2 నెలల పాటు యుద్ధాన్ని నిలిపివేయాలని కోరింది.