Benjamin Netanyahu: “ఎవరు మాకు హాని చేయాలని చూశారో.. వారికి మేం హాని చేస్తాం”.. ఇరాన్‌కి హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Benjamin Netanyahu: సిరియాలో ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయిల్ వైమానిక దాడికి ప్రతీకారంగా ఈ రోజు ఇరాన్, ఇజ్రాయిల్‌పై విరుచుకుపడింది. డ్రోన్లు, మిస్సైళ్లతో దాడి చేసింది. అయితే, ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థ వీటిని అడ్డుకుని నాశనం చేసింది. ఇదిలా ఉంటే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలపై ప్రపంచం ఆందోళన చెందుతోంది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరుతున్నాయి. ఇదిలా ఉంటే ఇరాన్ ప్రత్యక్ష దాడికి తమ దేశం చాలా ఏళ్లుగా సిద్ధమవుతోందని, ‘‘తమకు హాని కలిగించే ఎవరికైనా తాము హాని కలిగిస్తాం’’ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇరాన్‌కి వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Live-in Relation: లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న మహిళ దారుణహత్య.. బిడ్డను కూడా వదల్లేదు..
Also Read
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
‘‘ఇటీవల సంవత్సరాల్లో, ముఖ్యంగా ఇటీవల వారాల్లో ఇరాన్ ప్రత్యక్ష దాడికి ఇజ్రాయిల్ సిద్ధమవుతోంది. మా రక్షణ వ్యవస్థలు మోహరించబడ్డాయి. మేము రక్షణాత్మకంగా అంతా సిద్ధంగా ఉన్నాము. ఇజ్రాయిల్ బలంగా ఉంది. ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) బలంగా ఉంది. ఇజ్రాయిల్ ప్రజలు ధైర్యంగా ఉన్నారు’’ అని నెతన్యాహూ అన్నారు. ఇరాన్ దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయిల్‌కి అండగా నిలుస్తామని చెప్పింది. ఇరాన్‌తో పాటు దాని మిత్రదేశాల నుంచి ప్రాక్సీలు(హిజ్బుల్లా, హమాస్) వంటివి కూడా దాడికి పాల్పడ్డాయి.
‘‘ఇజ్రాయిల్‌కి అండగా నిలిచిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాలను మేము అభినందిస్తున్నాము. మాకు ఎవరూ హాని కలిగించానా, వారికి మేము హాని చేస్తాము. ఇదే మా సూత్రం. ఏదైనా ముప్పు నుంచి మనల్ని మనం రక్షించుకుంటాము. దీంట్లో ఇజ్రాయిల్ దృఢ నిశ్చయంతో ఉంది’’అని నెతన్యాహూ చెప్పారు. ఏప్రిల్ 1న సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇద్దరు జనరల్స్‌తో సహా ఏడుగురు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్(ఐఆర్జీసీ) సిబ్బంది మరణించారు. అప్పటి నుంచి ఇరాన్ ఇజ్రాయిల్‌పై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..