Israel: గాజా దక్షిణ ప్రాంతం నుంచి ఇజ్రాయిల్ పాక్షికంగా తన దళాలను ఉపసంహరించుకుంది. ఖాన్ యూనిస్ నగరం నుంచి ఇజ్రాయిల్ కొంత మంది సైనికులను బయటకు తీసుకువస్తున్నట్లు మిలిటరీ అధికారులు ఆదివారం తెలిపారు.
Iran: సిరియాలో ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయిల్ జరిపిన దాడిలో ఆ దేశానికి చెందిన కీలక మిలిటరీ అధికారులు మరణించారు. దీంతో అప్పటి నుంచి ఇరాన్ రగిలిపోతోంది. ఇజ్రాయిల్‌పై దాడి చేసేందుకు సిద్ధమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఒకవైపు ఇజ్రాయెల్ హమాస్ తో పాటు ఇతర ఉగ్రవాదులతో పోరాడుతుండగా, మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు ఇజ్రాయెల్‌లో మరోసారి వీధుల్లోకి వచ్చారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సిరియా రాజధాని డమాస్కస్‌లో ఉన్న ఇరాన్ రాయబార కార్యాలయ కాన్సులర్ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. ఈ ఘటనలో ఇరాన్‌కు చెందిన సీనియర్ సైనిక సలహాదారుతో పాటు ఇతర సిబ్బంది మరణించారు.
Israel: లెబనాన్‌పై ఇజ్రాయిల్ విరుచుకుపడింది. శుక్రవారం భారీగా వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ రాకెట్ యూనిట్ డిప్యూటీ హెడ్ మరణించినట్లు తెలిపింది.
Gaza Crisis : ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ గాజాకు వెళ్లేందుకు వేచి ఉన్న ట్రక్కుల పొడవైన లైన్ దగ్గర నిలబడి ఒక ప్రకటన చేశారు. శనివారం జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ.. సరిహద్దులో ఓ వైపు లారీలు నిలిచిపోయాయని, మరో వైపు దేశ ప్రజలంతా పస్తులు ఉండాల్సి వచ్చిందన్నారు.
Gaza War: ఇజ్రాయిల్-హమాస్ మధ్య పోరాటం భీకరం సాగుతోంది. అక్టోబర్ 7 నాటి దాడి తర్వాత హమాస్‌కి కేంద్రంగా ఉన్న పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) విరుచుకుపడుతోంది. తాజాగా హమాస్ కమాండ్ సెంటర్‌గా పనిచేస్తున్న అల్-షిఫా ఆస్పత్రిడిపై ఇజ్రాయిల్ బలగాలు దాడి చేశాయి. ఈ దాడిలో 20 మంది హమాస్ ఉగ్రవాదులు హతమయ్యారు. చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు.