Iron Dome-Arrow System: ఇజ్రాయిల్‌పై ఇరాన్ వందలాది డ్రోన్లు, మిస్సైళ్లతో దాడి చేసింది. ఏప్రిల్ 1న డమాస్కస్‌లోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయిల్ వైమానిక దాడి జరిపి ఇద్దరు ఇరాన్ జనరల్స్‌తో పాటు ఏడుగురు కీలక అధికారులను హతమార్చింది. దీనికి ప్రతిగా ఈ రోజు ఇజ్రాయిల్‌పై ఇరాన్ దాడి చేసింది. అయితే, ఈ దాడిని ఇజ్రాయిల్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వందలాదిగా వస్తున్న డోన్లు, మిస్సైళ్లను ఆకాశంలో అడ్డగించి పేల్చేశాయి.
ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థలో కీలమైన “ఐరన్ డోమ్”, “డేవిడ్ స్లింగ్”, “ఆరో డిఫెన్స్ సిస్టమ్స్” ఆ దేశాన్ని రక్షించాయి. ఇరాన్ నుంచి డ్రోన్లు, మిస్సైళ్లు వస్తున్నట్లు గుర్తించిన వెంటనే దేశంలో సైరన్లు మోగాయి. ఇజ్రాయిల్ తన రక్షణ వ్యవస్థను అప్రమత్తం చేసింది. ఆరో డిఫెన్స్ వ్యవస్థ చాలా డ్రోన్లను, మిస్సైళ్లను అడ్డుకుంది. ఇజ్రాయిల్ భూభాగానికి చేరుకోకముందే వాటిని ఆకాశంలోనే ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ దాడిని అడ్డుకుంది. 99 శాతం దాడిని అడ్డుకున్నట్లు ఇజ్రాయిల్ సైనిక ప్రతినిధి డేనియల్ హగారి చెప్పారు.
ఆరో ఏరియల్ డిఫెన్స్ సిట్టమ్ అంటే ఏమిటి..?
ఇజ్రాయెల్ యొక్క ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, US మిస్సైల్ డిఫెన్స్ ఏజెన్సీ సహకారంతో, యారో డిఫెన్స్ సిస్టమ్‌ను ఉత్పత్తి చేసింది. ఇది ఇజ్రాయిల్ మల్టీ లేయర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఆరో 1 సిస్టమ్ 1990లో వాడుకలోకి రాగా.. ఆరో-2 2000లో ప్రవేశపెట్టబడింది. అధునాతన ఆరో-3 సిస్టమ్ కూడా ఇజ్రాయిల్ వద్ద ఉంది. ఇది భూ వాతావరణం కన్నా ఎత్తు నుంచి వచ్చే మిస్సైళ్లను కూడా అడ్డుకుంటుంది. బాలిస్టిక్ క్షిపణులతో పాటు యెమెన్‌లోని హౌతీ మిలిటెంట్లు సుదూరం నుంచి ప్రయోగించే క్షిపణులని కూడా అడ్డుకుంటుంది.
ఈ రక్షణ వ్యవస్థలో క్షిపణి లాంచర్, EL/M-2080 గ్రీన్ పైన్ ఫైర్ కంట్రోల్ రాడార్ (FCR), హాజెల్ నట్ ట్రీ లాంచ్ కంట్రోల్ సెంటర్ (LCC) మరియు సిట్రాన్ ట్రీ బ్యాటిల్ మేనేజ్‌మెంట్ సెంటర్ ఉన్నాయి. గ్రీన్ పైన్ రాడార్ దీర్ఘ-శ్రేణి లక్ష్యాన్ని గుర్తించే సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇక మిస్సైల్ లాంచింగ్ వ్యవస్థ 14 టార్గెట్లను ఛేదించగలదు. FCR వ్యవస్థల ఎలక్ట్రానిక్ జామింగ్‌ను కూడా ఎదుర్కోగలదు. రాడార్ 2,400 కిలోమీటర్ల ప్రభావవంతమైన పరిధిని అందిస్తుంది మరియు 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు. ఇది మాక్ 9 (ధ్వని వేగం కంటే తొమ్మిది రెట్లు) వేగంతో దాడిని అడ్డుకుంటుంది.
డేవిడ్ స్లింగ్:
డేవిడ్ స్లింగ్, U.S. సహకారంతో కూడా అభివృద్ధి చేయబడింది, ఇది ఇజ్రాయెల్ యొక్క వైమానిక రక్షణ నిర్మాణంలో కీలకమైనది. ప్రధానంగా మధ్యస్థ శ్రేణి దాడులను ఇది లక్ష్యంగా చేసుకుంటుంది. లెబనాన్ నుంచి హిజ్బుల్లా రాకెట్ దాడులను ఇది తిప్పికొడుతోంది.
పేట్రియాట్ సిస్టమ్:
పేట్రియాట్ వ్యవస్థ 1991లో మొదటి గల్ఫ్ యుద్ధం నుంచి సేవలో ఉంది. దీన్ని మొదట్లో ఇరాన్ నుంచి స్కడ్ క్షిపణులను అడ్డగించడానికి మోహరించారు. విమానాలు, డ్రోన్లను టార్గెట్ చేసేందుకు ఇది ఉపయోగపడుతోంది.
ఐరన్ డోమ్:
ఇజ్రాయిల్ ప్రధాన రక్షణ వ్యవస్థలో ఐరన్ డోమ్ సిస్టమ్ ఒకటి. ఇది లెబనాన్, పాలస్తీనా నుంచి ఎదురయ్యే స్వల్ప శ్రేణి రాకెట్‌లని కూల్చివేస్తోంది. 90 శాతం సక్సెస్ రేట్ దీని సొంతం. ఇజ్రాయిల్ మౌలిక సదుపాయాలను రక్షించడంలో ఇది చాలా ప్రముఖంగా పనిచేస్తుంది.
ఐరన్ బీమ్:
ఇజ్రాయిల్ వాయు రక్షణ వ్యవస్థ సామర్థ్యాల్లో కీలకంగా ఉంది. ఇది అత్యాధునిక లేజర్ సాంకేతికతతో పనిచేస్తుంది. ఇది ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నప్పటికీ.. ఖచ్చితమైన ప్రతిఘటన సామర్థ్యాలతో ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థను మరింత దుర్భేద్యంగా మారుస్తోంది.