Iran: మా లక్ష్యం నెరవేరింది, ఆపరేషన్ ముగిసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: సిరియాలోని ఇరాన్ ఎంబసీపై ఏప్రిల్ 1న ఇజ్రాయిల్ వైమానిక దాడి చేసి, ఆ దేశానికి చెందిన కీలక జనరల్స్‌తో సహా ఏడుగురు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌కి చెందిన అధికారులను హతమార్చింది. అప్పటి నుంచి ఇరాన్, ఇజ్రాయిల్‌పై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. తాజాగా ఈ రోజు ఇజ్రాయిల్‌పై ఇరాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఈ దాడిని ఇజ్రాయిల్ సమర్థవంతంగా ఎదుర్కొంది.
Read Also: Benjamin Netanyahu: “ఎవరు మాకు హాని చేయాలని చూశారో.. వారికి మేం హాని చేస్తాం”.. ఇరాన్‌కి హెచ్చరిక..
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
ఇజ్రాయెల్‌పై తమ డ్రోన్ మరియు క్షిపణి దాడి “తమ లక్ష్యాలన్నింటినీ సాధించిందని” ఇరాన్ సైన్యం ఆదివారం తెలిపింది. ‘‘ఆపరేషన్ హానెస్ట్ ప్రామిస్.. నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు విజయవంతంగా పూర్తైంది. దాని లక్ష్యాలను సాధించింది’’ అని ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మహ్మద్ బఘేరీ తెలిపారు. ఇజ్రాయిల్ సిరియా డమాస్కస్‌పై జరిపిన దాడికి ఆత్మరక్షణ కోసం ఇజ్రాయిల్‌పై దాడి చేసినట్లు ఇరాన్ పేర్కొంది. ఈ దాడిలో ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ సెంటర్‌ని లక్ష్యంగా చేసుకుందని, ఎక్కడి నుంచి డమాస్కస్‌పై దాడి చేసేందుకు ఇజ్రాయిల్ F-35 జెట్‌లు బయలుదేరాయో ఆ ప్రాంతాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు బఘేరీ చెప్పారు. ఈ రెండు ప్రాంతాను ధ్వంసం చేసినట్లు చెప్పారు. అయితే, ఇజ్రాయిల్ పాక్షిక నష్టం వాటిల్లిందని చెప్పింది. ఈ ఆపరేషన్ లక్ష్యాలను సాధించిందని, దీనిని కొనసాగించాల్సిన అవసరం, ఉద్దేశం లేదని చెప్పారు. ఇరాన్‌పై తదుపరి చర్యలు తీసుకోకుండా ఉండాలని ఇజ్రాయిల్‌కి పిలుపునిచ్చాడు. ఇరాన్‌కి వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌కి ఎలాంటి సాయం చేయొద్దని అమెరికాని కోరాడు.
ఇక వేళ ఇజ్రాయిల్‌కి సాయం చేస్తే అమెరికా స్థావరాలు సురక్షితంగా ఉండవని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ చీఫ్ హుస్సేన్ సలామి మాట్లాడుతూ.. మా దౌత్యకార్యాలయంపై దాడి చేయడానికి ఉపయోగించిన ఇజ్రాయిల్ స్థావరాలను లక్ష్యం చేసుకున్నామని, ఇది పరిమిత ఆపరేషన్ అని చెప్పాడు. ఇది అనుకున్న దాని కన్నా విజయవంతమైందని సలామి చెప్పారు. ఇరాన్ ప్రయోజనాలను లేదా వ్యక్తులను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటే “ప్రతిదాడి” చేస్తానని అతను పునరుద్ఘాటించాడు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?