Israel: లెబనాన్‌పై ఇజ్రాయిల్ విరుచుకుపడింది. శుక్రవారం భారీగా వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ రాకెట్ యూనిట్ డిప్యూటీ హెడ్ మరణించినట్లు తెలిపింది.
Gaza Crisis : ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ గాజాకు వెళ్లేందుకు వేచి ఉన్న ట్రక్కుల పొడవైన లైన్ దగ్గర నిలబడి ఒక ప్రకటన చేశారు. శనివారం జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ.. సరిహద్దులో ఓ వైపు లారీలు నిలిచిపోయాయని, మరో వైపు దేశ ప్రజలంతా పస్తులు ఉండాల్సి వచ్చిందన్నారు.
Gaza War: ఇజ్రాయిల్-హమాస్ మధ్య పోరాటం భీకరం సాగుతోంది. అక్టోబర్ 7 నాటి దాడి తర్వాత హమాస్‌కి కేంద్రంగా ఉన్న పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) విరుచుకుపడుతోంది. తాజాగా హమాస్ కమాండ్ సెంటర్‌గా పనిచేస్తున్న అల్-షిఫా ఆస్పత్రిడిపై ఇజ్రాయిల్ బలగాలు దాడి చేశాయి. ఈ దాడిలో 20 మంది హమాస్ ఉగ్రవాదులు హతమయ్యారు. చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు.
ఇజ్రాయెల్‌పై దాడులను చేసేందుకు హమాస్ మిలిటెంట్లు గాజాలోని అల్-షిఫా ఆసుపత్రి ప్రాంతాల్లో ఉన్నారనే ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు.. ఇజ్రాయెల్ సైన్యం హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఆపరేషన్‌ను ప్రారంభించింది.
Israel: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ముఖ్యం ముస్లిం దేశాల్లో ఇజ్రాయిల్ పట్ల తీవ్ర వ్యతిరేకత పెరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఇజ్రాయిల్‌కి సంబంధించిన ఓ పోస్టు తెగవైరల్ అవుతోంది. ఇజ్రాయిల్ పాస్‌పోర్టు కలిగిన వారిని అనుమతించని దేశాల లిస్టు వైరల్ అయింది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనే పేజీలో ఇజ్రాయిల్ పౌరులను తమ గడ్డపైకి అనుమతించనని దేశాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం ముస్లిం మెజారిటీ కలిగిన దేశాలు ఉన్నాయి. అల్జీరియా, బంగ్లాదేశ్,…
ఇజ్రాయెల్, హమాస్ మధ్య నిరంతర యుద్ధం జరుగుతోంది. ఇదిలావుండగా.. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో మంగళవారం జరిగిన క్షిపణి దాడిలో భారతీయ పౌరుడు మరణించాడు. మరో ఇద్దరు భారతీయులు గాయపడ్డారు. ఈ దాడి జరిగిన ఒక రోజు తర్వాత ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడ నివసిస్తున్న భారతీయ ప్రజలకు భద్రతా సలహాను జారీ చేసింది.
India: ఇజ్రాయిల్-హమాస్ పోరు నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇజ్రాయిల్‌లో ఉంటున్న భారతీయులకు మంగళవారం కీలక సూచనలను జారీ చేసింది. క్షిపణి దాడిలో భారతీయులు మరణించిన తర్వాత, ఈ ఆదేశాలు జారీ చేసింది. ‘‘ ప్రస్తుతం భద్రతా పరిస్థితులు, స్థానిక భద్రతా సలహాల దృష్ట్యా దక్షిణ సరిహద్దు ప్రాంతాల్లో పనిచేసే, సందర్శించే వారు ఇజ్రాయిల్ లోని సురక్షిత ప్రాంతాలకు మకాం మార్చాలని సూచించారు. రాయబార కార్యాలయం వారితో టచ్‌లో ఉంది. ఇజ్రాయిల్ అధికారులు మా పౌరులందరికీ భద్రత కల్పించాలి’’…
Gaza War: అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడికి పాల్పడి 1200 మందిని చంపేయడంతో పాటు 240 మందిని బందీలుగా గాజాలోకి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ ఆర్మీ గాజాతో పాటు పాలస్తీనా భూభాగాలపై విరుచుకుపడుతోంది. గాజా స్ట్రిప్‌తో పాటు వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లోని హమాస్ స్థావరాలు, మిలిటెంట్లు లక్ష్యంగా దాడులు చేస్తోంది. హమాస్‌ని పూర్తిగా నిర్మూలించే వరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తి లేదని పలు సందర్భాల్లో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు.…
Israel-Hamas War: ఇజ్రాయిల్ హమాస్ మిలిటెంట్ల దాడి సాధారణ పాలస్తీనియన్లను దుర్భర పరిస్థితుల్లోకి నెట్టేసింది. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని దారుణంగా చంపేసింది. మరికొందరిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. ఇప్పటివరకు మరణాల సంఖ్య 30,000లను దాటింది. ఇదిలా ఉంటే ఇప్పుడు గాజాలోని ప్రజలు ఆకలితో దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. ఆహారం, మందులు లేక విలవిల్లాడుతున్నారు. ఉత్తర గాజా నుంచి వేల మంది పాలస్తీనియన్లు…