Israel: హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియేను జులైలో హత్య చేసింది తామేనని ఇజ్రాయెల్ తాజాగా ధ్రువీకరించింది. టెల్‌అవీవ్ రక్షణ మంత్రి కాట్జ్ ఈ విషయాన్ని తెలిపారు. అయితే, ఇటీవల కాలంలో హౌతీ రెబల్స్ ఇజ్రాయెల్‌పై ఎక్కువగా క్షిపణులతో దాడి చేస్తుంది. ఈ క్రమంలో వారికి ఓ స్పష్టమైన మెస్సేజ్ ఇవ్వాలని అనుకుంటున్నాం.. హమాస్, హెజ్‌బొల్లాలను ఓడించాం.. ఇరాన్ రక్షణ, ఉత్పత్తి వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశామని చెప్పుకొచ్చారు. సిరియాలో బషర్ అల్ అసద్‌ను అధికారానికి దూరం చేశాం.. వారి మౌలిక సదుపాయాలను దెబ్బతీయడంతో పాటు హనియే, యహ్వా సిన్వర్, నస్రల్లాలను చంపేశామన్నారు. యెమెన్‌లోని హౌతీలకు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తామని ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ కాట్జ్ హెచ్చరించారు.
Read Also: Sania-Shami: సానియా మీర్జా, మహమ్మద్ షమీ పెళ్లి ఫొటోలు వైరల్!
ఇక, ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఆ దేశ కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకారంలో పాల్గొన్న ఇస్మాయిల్ హనియే.. అక్కడే హత్యకు గురయ్యాడు. పథకం ప్రకారమే ఇజ్రాయెల్ ఈ దాడి చేసిందని ఇరాన్ ఆరోజే ఆరోపణలు చేసింది. అయితే, టెల్‌అవీవ్ దీనిపై స్పందించలేదు. తాజాగా ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ధ్రువీకరించడం గమనార్హం.
Read Also: Daaku Maharaj : డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సర్ ప్రైజ్ గెస్ట్
అయితే, మరోవైపు.. గాజాలో యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి హౌతీ రెబల్స్ ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు చేస్తోంది. వీరికి ఇరాన్ సపోర్ట్ ఇస్తుంది.. తాము పాలస్తీనియన్లకు మద్దతుగా నిలుస్తున్నామని హౌతీ తిరుగుబాటుదారులు తెలియజేస్తున్నారు. గాజాపై యుద్ధాన్ని ఆపే వరకు దాడులు చేస్తామని హౌతీలు పేర్కొంటున్నారు. దీంతో హౌతీల సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రతిదాడులకు దిగుతుంది.