గాజా, లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు ఆపేందుకు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని ప్రపంచమంతా ఎదురుచూస్తోందని ఇరాన్ పేర్కొంది.
లెబనాన్ రాజధాని బీరుట్ సమీపంలోని ఓ గ్రామంపై ఇజ్రాయెల్ సైన్యం బాంబు దాడి చేసింది. ఈ దాడిలో 7 మంది చిన్నారులు సహా 23 మంది మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఇజ్రాయెల్, లెబనాన్‌లోని హిజ్బుల్లా మధ్య భారీ బాంబు దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(IDF) లెబనాన్ లోపల హిజ్బుల్లా లక్ష్యాలపై వైమానిక దాడులు చేస్తోంది.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత హిజ్బుల్లా రెచ్చిపోయింది. ట్రంప్ ఎన్నిక తర్వాత దాడులు తగ్గుతాయని అంతా భావించారు. కానీ అందుకు రివర్స్‌గా జరుగుతుంది. లెబనాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా సోమవారం విరుచుకుపడింది. ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి దిగింది.
గాజాలో కరవు విలయతాండవం చేస్తోంది. ఏడాదికిపైగా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. ఇప్పటికే ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. భవంతులు కుప్పకూలాయి. ఆహార ఉత్పత్తులు అడుగంటాయి. స్వచ్ఛంద సంస్థల సహాయాలు నిలిచిపోయాయి. దీంతో కరవు మరింత దుర్భిక్షంగా మారింది.
హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. హమాస్ అగ్ర నాయకులందరినీ అంతమొందించింది. ఇక గాజా పట్టణాన్ని ఐడీఎఫ్ సర్వనాశనం చేసింది. అయితే చాలా దినాలుగా యుద్ధం జరుగుతుండడంతో గాజాలోని సామాన్య ప్రజలు తిండి లేక నానా యాతన పడుతున్నారు.
US F-15 Fighter Jets: పశ్చిమాసియాలో ఉద్రిక్త నేపథ్యంలో అమెరికా మోహరింపులు వేగవంతమయ్యాయి. తాజాగా ఎఫ్-15 ఫైటర్జెట్లను అక్కడికి తరలించినట్లు ఆ దేశ సైన్యం ప్రకటించింది.
Lebanon Israel War: లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో సుమారు 30 మంది ప్రాణాలు విడిచారు. బర్జా పట్టణంపై మంగళవారం రాత్రి జరిగిన దాడిలో ఓ అపార్టుమెంట్ కూలిపోయింది.
అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం ఇరాన్‌పై భారీ ఎఫెక్ట్ పడింది. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యారు. దీంతో ఇరాన్ కరెన్సీ రియాల్ ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది.
ప్రియమైన డొనాల్డ్ ట్రంప్, మెలానియాకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పుకొచ్చారు. చరిత్రలో గొప్ప పునరాగమనానికి అభినందనలు తెలిపారు.