పశ్చిమాసియాలో ఇంకా యుద్ధం కొనసాగుతోంది. హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి. తాజాగా జరిగిన దాడిలో 69 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. గాయపడినవారిలో ముగ్గురు జర్నలిస్టులు, ఐదుగురు పాలస్తీనా పౌర రక్షకులు ఉన్నారని తెలిపింది. ఇదిలా ఉంటే ఐడీఎఫ్ దళాల దాడుల్లో జర్నలిస్ట్ అల్ జజీరా ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఇతడు ఉగ్రవాది అంటూ తాజాగా ఇజ్రాయెల్ పేర్కొంది. గతంలో ఇతడు ఇస్లామిక్ జిహాద్‌లో భాగమని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: NEEK : దర్శకుడిగా రిస్క్ చేస్తున్న ధనుష్..?
అక్టోబర్ 7, 2023లో హమాస్.. అకస్మాత్తుగా ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా తీసుకువెళ్లిపోయారు. దీంతో ఇజ్రాయెల్ ప్రతీకారంతో రగిలిపోయింది. ఆ నాటి నుంచి హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై దాడులకు తెగబడింది. దీంతో గాజా దాదాపు సర్వనాశనం అయింది. హమాస్‌కు మద్దతు పలికిన హిజ్బుల్లాపై కూడా ఐడీఎఫ్ దళాలు దాడి చేశాయి. ఈ ఘటనలో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమయ్యాడు. అనంతరం ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై కాలు దువ్వింది. దీంతో ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసి ధ్వంసం చేసింది. ప్రస్తుతం లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య ఒప్పందం జరగడంతో ఎలాంటి దాడులు జరగడం లేదు. ప్రస్తుతం లెబనీయులు ఊపిరి పీల్చుకుంటున్నారు. గాజాపై మాత్రం ఇజ్రాయెల్ భీకరదాడులు సాగిస్తోంది. అయితే వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టేలోపు గాజాపై యుద్ధం ఆగాలని ట్రంప్ సూచించారు. వచ్చే నెలలోనే ట్రంప్.. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. ఆలోపు ఏం జరుగుతుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Farmer Won The Lottery: రైతుకు రూ.287 కోట్ల లాటరీ.. అంతలోపే ఊహించని ప్రమాదం..