సిరియాలో కారు బాంబు దాడి బీభత్సం సృష్టించింది. ఉత్తర సిరియాలోని టర్కీ మద్దతుగల సిరియన్ నేషనల్ ఆర్మీ నియంత్రణలో ఉన్న మన్బిజ్ నగరంలో కారు బాంబు దాడి జరిగింది. రిక్రూట్‌మెంట్ స్ట్రీట్‌లో పేలుడు జరిగింది. ఈ ఘటనలో పౌరులు సహా టర్కీ మద్దతు గల ఇద్దరు యోధలు చనిపోయారని తెలుస్తోంది. బాంబు ఘటనతో సమీప పరిసరాలు భీతావాహంగా మారాయి. వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అయితే ఈ దాడికి పాల్పడింది ఏ గ్రూప్ అధికారికంగా ప్రకటించలేదు. అయితే అమెరికా మద్దతు ఉన్న గ్రూపే సిరియాలో శాంతికి విఘాతం కలిగిస్తోందని స్థానికంగా నివేదిక అందుతోంది.
ఇది కూడా చదవండి: Jagdeep Dhankhar: ‘‘బైపాస్ సర్జరీకి కూరగాయల కత్తిని వాడకూడదు’’.. ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
ఇటీవలే తిరుగుబాటుదారులు సిరియాను ఆక్రమించుకున్నారు. రెబల్స్ దాడికి భయపడి అధ్యక్షుడు అసద్ రష్యాకు పారిపోయాడు. దీంతో డమాస్కస్‌ను తిరుగుబాటుదారులు ఆక్రమించుకున్నారు. రెబల్స్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత సిరియాలో ఇలాంటి దాడి జరగడం మొట్టమొదటిసారి. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ కూడా ఆయుధ సంపత్తిని నాశనం చేసేందుకు దాడులు చేస్తోంది. ఇప్పటికే భారీ దాడులు నిర్వహించింది.
ఇది కూడా చదవండి: CM Revanth: క్రిస్టియన్ సోదరులు, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు..
మరోవైపు అమెరికా-ఇజ్రాయెల్ కుట్ర వల్లే సిరియా రెబల్స్ చేతుల్లోకి వెళ్లిపోయిందని ఇరాన్ ఆరోపించింది. ఈ మేరకు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర ఆరోపణలు చేశారు. సిరియా భూభాగాన్ని ఆక్రమించుకోవడంతో అంతర్జాతీయ నేరంగా తెలిపారు. ఇరు దేశాల కుట్రతోనే ఇదంతా జరిగిందని ఖమేనీ తీవ్రంగా ఆరోపించారు.
A car packed with explosives appear to have exploded in the Syrian city of Manbij (east Aleppo) under the control of Turkish backed armed groups – pic.twitter.com/i8y5sAEbRr
— kurdish blogger (@kurdishblogger) December 24, 2024