Netanyahu: ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు ఆదివారం ‘‘ప్రొస్టేట్ రిమూవల్ సర్జరీ’’ జరగనుంది. యూనినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షనన్‌తో నెతన్యాహూ బాధపడుతున్నట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. బుధవారం హడస్సా ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్న తర్వాత, ఆయన ప్రొస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్ కారణంగా మూత్రనాళాల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు తేలింది.
Read Also: H-1B Visa: H-1B వీసాలకు ట్రంప్ మద్దతు.. భారతీయులకు గుడ్ న్యూస్..
ఈ ఏడాది మార్చిలో హెర్నియా శస్త్రచికిత్స చేయించుకున్నారు. అంతకుముందు ఏడాది జూలైలో వైద్యులు ఆయనకు పేస్‌మేకర్ అమర్చారు. అక్టోబర్ 07 నాడు హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడులు చేసిన తర్వాత నుంచి ఇజ్రాయిల్ హమాస్, హిజ్బుల్లా, ఇరాన్, హౌతీలతో ఫైట్ చేస్తోంది. గత ఏడాది కాలంగా యుద్ధంలో నెతన్యాహూ బిజీగా ఉన్నాడు. అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. హిజ్బుల్లా, హమాస్‌ని దాదాపుగా ఇజ్రాయిల్ భూస్థాపితం చేసింది.