నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు ప్రదర్శిస్తోంది. తొలి అరెస్ట్‌గా బీహార్‌లో ఇద్దరు వ్యక్తులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. పేపర్ లీక్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గురువారం తొలి అరెస్టులు చూపించింది.
త్వరలోనే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. శనివారమే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది
నేడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో పశు సంవర్ధక శాఖ, డెయిరీ డెవలప్మెంట్, మత్స్యశాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపలు, గొర్రెల పంపిణీ పథకాల్లో లావాదేవీలపై విజిలెన్స్ & ఎన్ఫోర్స్ మెంట్ ఎంక్వైరీ వేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
సచివాలయంలో హెచ్ఎండీఏ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ పై రివ్యూ చేపట్టారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా.. రీజనల్ రింగ్ రోడ్డు పరిధి లోపల ఉన్న ప్రాంతాన్ని హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకురావాలని సీఎం పేర్కొన్నారు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ కు అనుసంధానంగా రేడియల్ రోడ్స్ అభివృద్ధి…
తాజాగా మరో కుంభకోణం బయటకు వచ్చింది. ఆవుల కొనుగోలు అక్రమాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే, ఆవుల కొనుగోలు వివరాలను సేకరించిన ఏసీబీ కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
గొర్రెల పంపిణీ అవకతవకల్లో ఏసీబీ అధికారులు నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో నలుగురు పశుసంవర్ధక శాఖ అధికారులు ఉన్నారు. వారిలో కామారెడ్డి పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రవి, మేడ్చల్ పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య, అడల్ట్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ గణేష్, రంగారెడ్డి గ్రౌండ్ వాటర్ మేనేజర్ రఘుపతి రెడ్డి ఉన్నారు. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన కుంభకోణానికి సంబంధించిన కేసును ఏసీబీ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. గొర్రెల పంపిణీలో…
Yadadri temple: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయంలో విధులు నిర్వహించే డోలు వాయిద్యకారుడు వెంకటసుబ్బయ్య పై సస్పెన్షన్ వేటు పడింది. ఆలయ వాయిద్యకారుల పోస్టుల నియామకాల బోర్డు మెంబర్ గా ఉన్న వెంకటసుబ్బయ్య సస్పెన్షన్ సంచలనంగా మారింది.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో జరిగిన అవకతవకల పై రాష్ట్రానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ లేఖ రాసింది. తెలంగాణ రాష్ట్రంలో 9 జూన్ నుండి 12 జూన్ 2022 వరకు మహాత్మా గాంధీ NREGS అమలుకు సంబంధించి కేంద్ర బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే.. NREGS అమలులో అనేక అవకతవకలు గుర్తించింది. అనుమతి లేని పనులను చేపట్టడం (అటవీ ప్రాంతాల్లో ఆహార ధాన్యాలు ఆరబెట్టే ప్లాట్‌ఫారమ్ లేదా అస్థిరమైన కందకాల…
విద్యుత్ శాఖలో జూనియర్ లైన్‌మెన్ల నియామక పరీక్షలో జరిగిన అక్రమాలపై పోలీసులు దృష్టి కేంద్రీకరించాయి. జూలై 17న జరిగిన రాత పరీక్షలో కొందరు అభ్యర్థులకు సెల్‌ఫోన్ ద్వారా సమాధానాలు రాయడాన్ని ఘట్‌కేసర్ లోని ఓ పరీక్షకేంద్రం అధికారి గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయండో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆరాతీయగా నిజాల తెలిసి ఖంగుతున్నారు. అక్కడ సెల్‌ఫోన్ పరీక్ష రాసింది ఒక్కరేకాదు పదుల సంఖ్యలో అభ్యర్థులు సెల్‌ఫోన్ల ద్వారా సమాధానాలు వెల్లినట్లు…
అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే..అర్హత లేకున్నా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చీమకుర్తి నగర పంచాయతీ చైర్మన్, వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నారని, సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది.. ఛైర్మన్ గా ఉంటూ నలుగురు అర్హులకు పెన్షన్ల కోసం సిఫారసులు చేయాల్సింది పోయి ఆయనే పెన్షన్ తీసుకోవటమేంటని విమర్శలు వస్తున్నాయి. ప్రకాశం జిల్లా చీమకుర్తి నగర పంచాయతీ చైర్మన్ చల్లా అంకులు, నెలా నెలా వృద్ధాప్య పింఛను అందుకుంటున్న విషయం జిల్లాలో…