విద్యుత్ శాఖలో జూనియర్ లైన్‌మెన్ల నియామక పరీక్షలో జరిగిన అక్రమాలపై పోలీసులు దృష్టి కేంద్రీకరించాయి. జూలై 17న జరిగిన రాత పరీక్షలో కొందరు అభ్యర్థులకు సెల్‌ఫోన్ ద్వారా సమాధానాలు రాయడాన్ని ఘట్‌కేసర్ లోని ఓ పరీక్షకేంద్రం అధికారి గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయండో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆరాతీయగా నిజాల తెలిసి ఖంగుతున్నారు. అక్కడ సెల్‌ఫోన్ పరీక్ష రాసింది ఒక్కరేకాదు పదుల సంఖ్యలో అభ్యర్థులు సెల్‌ఫోన్ల ద్వారా సమాధానాలు వెల్లినట్లు గుర్తించి నిర్ఘాంతపోయాలు.
నగరంలోని మలక్‌పేటలో విధులు నిర్వహిస్తున్న ఏడీఈ ఫిరోజ్ ఖాన్, కోదాడలో సహాయ ఇంజినీర్ గా పనిచేస్తున్న సైదులు పరీక్ష రాసిన వారికి సమాధానాలు అందజేశారని రాచకొండ పోలీసులు గుర్తించారు. అయితే వీరిద్దరి వద్దకు ప్రశ్నాపత్రం ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈనేపథ్యంలో.. మరో నలుగురు విద్యుత్ శాఖ అధికారులను పోలీసుల అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు విశ్వనీయ సమాచారం.
కాగా.. నగరంలో జూనియర్ లైన్‌మెన్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు అధికారులు నాలుగేళ్లు నుంచి దందా కొనసాగిస్తున్నారని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ భారీ స్కామ్ లో ఇద్దరు సహాయ డిప్యటి ఇంజినీర్లు, నలుగురు సహాయ ఇంజినీర్లు, తొమ్మిది మంది లైన్‌మెన్లు అక్రమాలకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇందులోభాగంగా.. ఏడీఈల్లో ఒకరు ఉమ్మడి నల్గొండ, మరొకరు హైదరాబాద్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అయితే..వీరిద్దరు నాలుగేళ్ల క్రితం పలువురు అభ్యర్థుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది.
కాగా.. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ 70 అసిస్టెంట్ ఇంజనీర్, వెయ్యి జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీకి మే 9 న నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా జూలై 17న గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు కేంద్రాల్లో ఉదయం జూనియర్ లైన్‌మెన్‌లకు, మధ్యాహ్నం అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
BJP MP Ravi Kishan: జనాభా నియంత్రణ బిల్లుపై రవికిషన్ కు చుక్కలు చూపిస్తున్న నెటిజెన్లు