జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో జరిగిన అవకతవకల పై రాష్ట్రానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ లేఖ రాసింది. తెలంగాణ రాష్ట్రంలో 9 జూన్ నుండి 12 జూన్ 2022 వరకు మహాత్మా గాంధీ NREGS అమలుకు సంబంధించి కేంద్ర బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే.. NREGS అమలులో అనేక అవకతవకలు గుర్తించింది. అనుమతి లేని పనులను చేపట్టడం (అటవీ ప్రాంతాల్లో ఆహార ధాన్యాలు ఆరబెట్టే ప్లాట్‌ఫారమ్ లేదా అస్థిరమైన కందకాల నిర్మాణం), మైనర్ ఇరిగేషన్-ట్యాంకుల పూడిక తీరకు సంబంధించిన పనుల అంచనా, ఆమోదం, అమలులో అవకతవకలు వంటి అంశాలను కేంద్ర బృందం తనిఖీలో బయట పడిందని లేఖలో పేర్కొన్నారు.
read also: Central Letter to Telangana: NREGSలో అవకతవకలు.. రాష్ట్రానికి కేంద్రం లేఖ..
నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించకపోవడం, అస్థిరమైన కందకాల పనులకు సంబంధించిన.. ఎత్తైన గ్రేడియంట్లు ఉన్న కొండ ప్రాంతాలకు బదులుగా మైదాన ప్రాంతాలలో చేపట్టడం, అవి ఉపయోగపడనీ చోట వుండటం గుర్తించామని తెలిపారు. సాంకేతిక పరమైన ఆమోదం పొందకుండా పనులను చేపట్టారని పేర్కొన్నారు. కమ్యూనిటీ సమాచార బోర్డులు, జాబ్ కార్డ్‌లు, గ్రామ పంచాయతీలలో సరైన డాక్యుమెంటేషన్ నిర్వహణ ఉల్లంఘనలకు పాల్పడ్డారని తెలిపారు. ఈ అవకతవకలపై మరింత విచారణ జరపడానికి 15 సెంట్రల్ టీమ్ లు క్షేత్ర స్థాయిలో పర్యటించాయని లేఖలో పేర్కొన్నారు. గత కేంద్ర బృందం గమనించిన విధంగానే, ఈ బృందాలు లోపాలను గుర్తించాయని తెలిపారు.
వివరణాత్మక నివేదికలను తెలంగాణ ప్రభుత్వంకి ఈ బృందాలు ఇచ్చాయని తెలిపారు. నివేదికలు తీవ్రమైన అవకతవకలను వెల్లడించాయి. ఉపాధి హామీ చట్టంకి వ్యతిరేకంగా పనులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చేసిన పనులకు అయిన ఖర్చును తిరిగి చెల్లించాలని తెలిపారు. డిఫాల్టర్లపై క్రిమినల్ అడ్మినిస్ట్రేటివ్ చర్యలు తీసుకోవాలని కోరింది. వారి నుండి రికవరీ చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోందని తెలిపారు. కేంద్ర బృందాలు, మంత్రిత్వ శాఖ హైలైట్ చేసిన అన్ని సమస్యలపై క్షుణ్ణంగా విచారణ జరపాలని, సవివరమైన యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ATR)ని సెప్టెంబర్ 11 వరకు పంపించాలని లేఖలో పేర్కొన్నారు. మరి దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తో వేచి చూడాల్సి వుంది.
RSS: ప్రొఫైల్ పిక్ మార్చిన ఆర్ఎస్ఎస్.. 75వ స్వాతంత్య్ర దినోత్సవం ముందు కీలక పరిణామం