ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్‌ను ప్రదర్శించినపుడు వారు వెలుగులోకి వస్తుంటారు. కొంతమంది ఇనుప ముక్కలను, గాజు ముక్కలను తిని రికార్డ్ సాధిస్తుంటారు. అయితే, ఇరాన్‌కు చెందిన అబోల్ ఫాజీ ముఖ్తారీ అనే వ్యక్తి అందరికంటే భిన్నంగా తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. తన శరీరంపై 85 స్పూన్లను బ్యాలెన్స్ చేస్తూ రికార్డ్ సాధించాడు. మామూలుగా శరీరంపై స్పూన్లను పేర్చి అవి కిందపడకుండా బ్యాలెన్స్ చేయాలంటే సాధ్యపడే పనికాదు. కానీ, అబోల్ ఫాజీ ముఖ్తారీ అనే వ్యక్తి…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ లు ఆక్రమించుకున్నాక అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తాలిబన్ ప్రభుత్వంను అధికారికంగా ఏ దేశాలు గుర్తించలేదు. తాలిబన్లకు మిత్రులుగా ఉన్న పాక్, చైనాలు కూడా అధికారికంగా గుర్తించలేదు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో 22 శాతం మంది ప్రజలు ఆకలితో అలమటిస్తుండగా, మరో 36 శాతం మంది ప్రజలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. తాలిబన్ లు అధికారంలోకి వస్తే పాక్ ప్రాభల్యం పెరుగుతుందని, ఇది పోరుగునున్న భారత్‌కు ఇబ్బందికరమని, ఆఫ్ఘనిస్తాన్‌లో భారత్ చేపడుతున్న ప్రాజెక్టులకు,…
ఆఫ్ఘన్ భూభాగాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించకూడదని ఎనిమిది దేశాలు ఆమోదించిన ఉమ్మడి ప్రకటనను అజిత్ ధోవల్ బుధవారం విడుదల చేశారు. న్యూ ఢిల్లీలో జరిగిన ఆఫ్ఘనిస్తాన్పై మూడవ ప్రాంతీయ భద్రతా సంభాషణలో భాగంగా 7 దేశాల NSAలు ప్రకటనను ఆమోదించాయి. జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ ధోవల్ ప్రాతినిథ్యం వహించిన సెక్యూరిటీ ఆన్ ఆప్ఘాన్ డైలాగ్ డిక్లరేషన్ లో ఇరాన్, రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్థాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్థాన్‌లు పాల్గొన్నాయి. చర్చల్లో చేరాల్సిందిగా చైనా, పాకిస్థాన్‌లను…
ఇరాన్‌పై అమెరికా మరోసారి విరుచుకుపడింది. పరిమితికి మించి యూరేనియం నిల్వలను పెట్టుకుంటోందని చెప్పి ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల కారణంగా ఇరాన్ వేలకోట్ల రూపాయలను నష్టపోయింది. కాగా, ఆంక్షల కారణంగా నష్టపోయిన 10 బిలియన్ డాలర్లను అమెరికా వెంటనే చెల్లించాలని, ఆ తరువాతే అణు ఒప్పందంపై చర్చలు జరపాలని, అణు ఒప్పందంపై అమెరికానే ముందుకు రావాలని ఇరాన్ పేర్కొన్నది. 2018 నుంచి ఇరాన్‌పై ఆంక్షలు విధించారు. అయితే, బైడెన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత…
సరిగ్గా 41 ఏళ్ల క్రితం అంటే 1980లో ఇరాక్ -ఇరాన్ దేశాల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో దాదాపుగా 10 లక్షల మందికి పైగా మృతి చెంది ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి. రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం బహుశా ఈ యుద్ధం సమయంలోనే జరిగి ఉంటుంది. రెండు దేశాల మధ్య దాదాపుగా 8 ఏళ్లపాటు ఈ యుద్ధం జరిగింది. అసలు రెండు దేశాల మధ్య యుద్ధం జరగడానికి కారణం ఏంటి? తెలుసుకుందాం. 1979 లో ఇస్లామిక్…
ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రజలు బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆగస్టు 30 వరకు కాబూల్ ఎయిర్పోర్ట్ వైపు పరుగులు తీసిన ప్రజలు ఇప్పుడు అక్కడ ఒక్క పురుగు కూడా కనిపించడం లేదు. అమెరికా దళాలు లేకపోవడంతో ప్రజలంతా ఏమయ్యారు… ఎటువెళ్లారు. తిరిగి ఇళ్లకు వెళ్లారా అనే డౌట్ రావొచ్చు. అమెరికా దళాలు వెళ్లిపోయిన తరువాత ప్రజలు రూటు మార్చి ఇరాన్, పాకిస్తాన్ సరిహద్దుల వైపు పరుగులు తీశారు. వేల సంఖ్యలో ఇరాన్ సరిహద్దులకు ప్రజలు చేరుకోవడంతో అక్కడ భద్రతను…
ఇరాన్లో రోజువారీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రతిరోజు 50 వేలకు పైగా నమోదవుతుండటం అందోళన కలిగిస్తోంది. ఇక ఇరాన్లో అమెరికా, బ్రిటన్లకు చెందిన టీకాలను నమ్మడంలేదు. ఆ రెండు దేశాలు తయారు చేసిన టీకాలు నమ్మదగినవి కాదని ప్రభుత్వ వర్గాలు చెబుతుండటంతో ఇరాన్ లో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉన్నది. వ్యాక్సిన్ లను బ్లాక్‌లో భారీ ధరలకు విక్రయిస్తున్నారు. అస్త్రాజెనకా వ్యాక్సిన్ ధర బ్లాక్‌లో 90 వేలకు పైగా పలుకుతున్నది. బ్లాక్‌లో ధరలు భారీగా…
కోవిడ్ కట్టడిలో భాగంగా సౌదీ అరేబియా ప్రభుత్వం తమ పౌరులకు కొత్త ఆంక్షలు విధించింది. రెడ్ లిస్ట్ పేరుతో రూపొందించిన జాబితాలోని దేశాలకు వెళ్లిన వారికి భారీ జరిమానాలు సహా విదేశాలకు వెళ్లకుండా మూడేళ్లపాటు నిషేధం విధించనున్నట్టు ప్రకటించింది. నిషేధిత దేశాలకు వెళ్లడం.. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించడమేనని అక్కడి సర్కారు స్పష్టం చేసింది. అయితే, ఆ జాబితాలో భారత్ తో పాటు యూఏఈ, లిబియా, సిరియా, లెబనాన్, యెమెన్, ఇరాన్, టర్కీ, అర్మేనియా, ఇథియోపియా, సొమాలియా, కాంగో,…