Iran Issues 1st Death Sentence Linked To Anti-Hijab Riots: ఇస్లామిక్ కంట్రీ ఇరాన్ హిజాబ్ వ్యతిరేక అల్లర్లలో అట్టుడుకుతోంది. 22 ఏళ్ల మహ్స అమిని అనే మహిళను హిజాబ్ సరిగ్గా ధరించలేదని చెబుతూ అక్కడి మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత సెప్టెంబర్ 16న ఆమె చనిపోయింది. దీంతో అక్కడి మహిళల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. దీంతో మహిళలు, యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. మహిళలు హిజాబ్ తీసేస్తూ.. జట్టు కత్తిరించుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఇదిలా ఉంటే ఈ నిరసనల్లో ఇప్పటి వరకు 300 మందికి పైగా చనిపోయారు. ఇందులో 40 మంది వరకు భద్రత సిబ్బంది ఉన్నారు.
Read Also: G20 summit: నేటి నుంచి జీ 20 సమావేశాలు.. ఇండోనేషియా వెళ్లనున్న ప్రధాని మోదీ
గత రెండు నెలలుగా ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక నిరసనలు జరుతున్నాయి. కొన్ని వారాలుగా ఇరాన్ వ్యాప్తంగా మతాధికారుల పాలన అంతం కావాలని చెబుతూ.. యువత, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హిజాబ్ వ్యతిరేక అల్లర్లలో పాల్గొనందుకు తొలిసారిగా ఇరాన్ కోర్టు ఒకరికి మరణ శిక్ష విధించింది. ప్రభుత్వ భవనానికి నిప్పు పెట్టడం, ప్రజాశాంతికి భంగం కలిగించడంతో పాటు జాతీయ భద్రతకు వ్యతిరేకంగా పాల్గొన్న నేరాల కింద ఇరాన్ రివిల్యూషనరీ గార్డ్ కోర్టు మరణ శిక్ష విధించింది. దేవుడికి శతృవు, దేశంలో అవినీతి వంటి నేరాల కింద శిక్షను విధించింది. మరో ఐదుగురికి పదేళ్ల జైలు శిక్ష విధించింది.
దోషులు అంతా తమ శిక్షలపై అప్పీలు చేసుకోవచ్చని ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. ఇరాన్ చట్టాల ప్రకారం అక్కడ శిక్షలు దారుణంగా ఉంటాయి. దైవ దూషణతో పాటు మహిళలు హిజాబ్ ధరించకున్నా, దొంగతనం, హత్యలకు శిక్షలు కఠినంగా ఉంటాయి. కన్నుకు కన్ను అనే రీతిలో అక్కడి ప్రభుత్వం శిక్షను అమలు చేస్తుంది. ఇప్పటి వరకు యాంటీ హిజాబ్ అల్లర్లలో మూడు ప్రావిన్సుల్లో కలిపి 2000 మందికి పైగా అభియోగాలు నమోదు అయ్యాయి.