Man who lived in Charles de Gaulle airport for 18 years dies there: గత 18 ఏళ్లగా ఫ్రాన్స్ పారిస్ లోని చార్లెస్ డి గల్లె విమానాశ్రయంలోనే నివసిస్తున్న వ్యక్తి మోహ్రాన్ కరీమీ నస్సేరీ చివరకు అక్కడే కన్నుమూశాడు. ఏ దేశానికి చెందిన వాడు కాకపోవడంతో గత 18 ఏళ్లుగా ఎయిర్ పోర్టునే ఇళ్లుగా, ప్రయాణికులనే బంధువులుగా భావిస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. ఎయిర్ పోర్టులోని ఓ మూలలో తన సామాన్లను పెట్టుకుని అక్కడే నివసిస్తూ ఉండేవాడు. ఈయన లైఫ్ స్టోరీ ఆధారంగా ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ ‘ ది టెర్మినల్’ చిత్రాన్ని రూపొందించారు.
శనివారం ఎయిర్ పోర్టులోనే గుండె పోటులో మోహ్రాన్ కరీమీ నస్సేరీ మరణించినట్లు అధికారులు వెల్లడించారు. కరిమి నస్సేరీ జన్మతా ఇరానియన్. 1945లో మెహ్రాన్ కరీమి నస్సేరి ఇరాన్ లో జన్మించారు. ఈయన తండ్రి ఇరాన్ జాతీయుడు, తల్లి స్కాట్లాండ్ జాతీయురాలు. 23 ఏళ్ల వయసులో నస్సేరీ తండ్రి క్యాన్సర్ తో మరణించారు. అక్కడ బ్రాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో యుగోస్లావ్ స్టడీస్ చదువుతూ మూడేళ్లు బ్రిటన్ లోనే గడిపారు. ఆ సమయంలో ఇరాన్ కు వ్యతిరేకంగా ఆందోళనకు పాల్పడటంతో ఇరాన్ దేశం ఆయన్న బహిష్కరించింది.
Read Also: Pakistan: పాకిస్తాన్ ఆశలపై నీళ్లు.. సౌదీ క్రౌన్ ప్రిన్స్ పర్యటన వాయిదా…
1981లో బెల్జియం నస్సేరీకి బెల్జియం శరణార్థి హోదా ఇచ్చింది. అయితే మళ్లీ తన తల్లిని కలుసుకునేందుకు బ్రిటన్ బయలుదేరాడు. అయితే ఆ సమయంలో శరణార్థికి సంబంధించి పత్రాలను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో యూకే వచ్చిన తర్వాత పదేపదే నిర్భంధించబడ్డాడు. బెల్జియం, ఫ్రాన్స్ దేశాలకు తిప్పిపంపారు యూకే అధికారులు. ఈ క్రమంలో ఫ్రాన్స్ ఛార్లెస్ డి గల్లే ఎయిర్ పోర్టులో చిక్కకుపోయాడు. 1988 నుంచి 2006 వరకు ఎయిర్ పోర్టులోనే జీవించాడు. అనంతరం ఆయన్ను వేరే ప్రాంతానికి తరలించారు. అప్పటి నుంచి అడపాదడపా ఎయిర్ పోర్టుకు వచ్చేవారు. ఈ క్రమంలో శనివారం టెర్మినల్-2లో మరణించారు.
2006లో తొలిసారిగా ఆరోగ్య సమస్యల వల్ల తొలిసారిగా ఎయిర్ పోర్టును వదిలి బయటకువెళ్లారు నస్సేరీ. ఎయిర్ పోర్టులో ఉన్న కాలం మొత్తం పుస్తకాలు చదవడం, డైరీ రాయడం వంటి పనులు చేస్తూ కాలక్షేపం చేస్తుండే వారు నస్సేరీ. 2004లో ఈయన కథ ఆధారంగానే స్పిల్ బర్గ్ ‘ ది టెర్మినల్’ సినిమాను రూపొందించారు. ఇతని ఆత్మకథ ఆధారంగా ‘ ది టెర్మినల్ మ్యాన్’ పుస్తకం ప్రచురించారు.