చైనాలో వరసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఆదివారం మరోసారి భూకంపం వచ్చింది. జిన్ జియాంగ్ ఉయ్గర్ అటానమస్ రీజియన్ లో ఆదివారం 5.2 తీవ్రతతో భూకంపం వచ్చిందని చైనా ఎర్త్‌క్వేక్ నెట్వర్క్ సెంటర్ వెల్లడించింది. భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. అంతకుముందు రోజు శనివారం కూడా జిన్జియాంగ్ ప్రావిన్స్ లో రిక్టర్ స్కేల్ పై 4.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. జూన్ నెలలో చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లో 5.8 తీవ్రతతో భూకంపం…
ఇరాన్ శక్తివంతమైన భూకంపంతో వణికింది. శనివారం తెల్లవారుజామున దక్షిణ ఇరాన్లో రిక్టర్ స్కేల్ పై 6.0తో భూకంపం సంభవించింది. హెర్మోజ్ ప్రావిన్స్ లోని బందర్ అబ్బాస్ నగరానికి నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదు అయింది. ఇప్పటి వరకు అందిన సమచారం ప్రకారం ఎనిమిది మందికి గాయాలు కాగా.. ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ భూకంపం వల్ల సరిహద్దు దేశాలైన…
తూర్పు ఇరాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఒక ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు మరణించగా, 50 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెప్తున్నారు. తబాస్ సమీపానికి చేరుకున్న తర్వాత రైలులోని ఏడు బోగీల్లో నాలుగు పట్టాలు తప్పినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే.. మూడు హెలికాప్టర్లలో రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి…
ఓ వైపు కోవిడ్ మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో కూడా ప్రపంచ వ్యాప్తంగా అమలైన మరణ శిక్షల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. 2020తో పోలిస్తే 2021లో మరణ శిక్షలు దాదాపుగా 20 శాతం పెరిగినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ తెలిపింది. 2021లో 18 దేశాలు 579 మరణ శిక్షలను విధించాయి అని వెల్లడించింది. 2020లో 246 మంది నుంచి 314 మందికి మరణశిక్షలు విధించారు. ముఖ్యంగా ఇరాన్ లో గత నాలుగు సంవత్సరాల్లో మరణశిక్షల సంఖ్య పెరిగింది.…
ఉక్రెయిన్ – రష్యా యుద్ధ పరిణామాలు భారత్ నే కాదు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వల్ల ఇప్పటికే భారత్ లో వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇదిలా ఉంటే మిడిల్ ఈస్ట్ కంట్రీ ఇరాన్ కు కూడా ఉక్రెయిన్ సెగ తగిలింది. ఆ దేశంలో పలు నిత్యావసరాల ధరలు 300 శాతం పెరిగాయి. ఇరాన్ ప్రభుత్వం గురువారం నాడు చికెన్, పాలు, గుడ్ల వంటి ప్రధాన నిత్యావసరాల ధరలను…
ఉక్రెయిన్‌పై యుద్ధం రష్యాకు భారంగా మారింది. ప్రపంచ దేశాలు విధిస్తోన్న ఆంక్షలకు రష్యా అల్లాడిపోతోంది. వ్యాపారాలు ఊహించని స్థాయిలో దెబ్బతిన్నాయి. ప్రస్తుతం రష్యాపై 5వేలకు పైగా ఆంక్షలుండగా… అందులో 2,700కు పైగా గత 10 రోజుల్లో విధించినవే. ప్రపంచంలో నార్త్ కొరియా, ఇరాన్ లాంటి దేశాల కంటే రష్యాపైనే ఎక్కువ ఆంక్షలు అమలవుతున్నాయి. మరోవైపు మల్టీ నేషనల్ కంపెనీలన్నీ యుద్ధానికి నిరసనగా రష్యాలో తమ ఆపరేషన్స్ ఆపేశాయి. కొన్ని కంపెనీలైతే రష్యా మార్కెట్ నుంచి పూర్తిగా వెళ్లిపోతున్నట్టు…
కరోనా కాలంలో మాస్క్ ఎంతగా ఉపయోగపడుతుంతో చెప్పాల్సిన అవసరం లేదు. మాస్క్ ధరించడం వలనే కోట్లాది మంది ప్రాణాలు కాపాడుకోగలిగారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ మాస్క్ లేకుంటే వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీకాదు. ఇరాన్ కు చెందిన కార్టూనిస్ట్ ఆయత్ నదేరీ ఇస్ఫాహన్ యూనివర్శిటీలో ఆర్ట్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. టీచింగ్ వృత్తితో పాటు ఆయన సృజనాత్మకంగా గీసే కార్టూన్స్ ఎంతగానో ప్రసిద్ధి చెందాయి. క్యారికేచర్ గ్రామ్, తాష్ ఆర్ట్స్ వంటి అకాడమీలను ఏర్పాటు చేసి నిత్యం కార్టున్లపై శిక్షణ…
వంటల్లో మసాలాలు పడితే ఆ చుచి వేరుగా ఉంటుంది. ఇండియాలో మసాలాలు ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఒక్క ఇండియాలోనే కాదు వివిధ దేశాల్లో మసాలాలు వినియోగిస్తారనే సంగతి తెలుసు. అయితే, ఇరాన్‌లోని హర్మూజ్ ఐలాండ్‌లో ప్రజలు మట్టిని మసాలాలుగా వినియోగిస్తుంటారు. ఇది వినడానికి విచిత్రంగా ఉండొచ్చు. అక్కడి అనేక రకాల పర్వతాలు ఉన్నాయి. ఒక్కో పర్వతం ఒక్కో రంగుతో ఉంటుంది. అంతేకాదు, ఆ పర్వతాల నుంచి వచ్చే మట్టి ఒక్కో రుచిని కలిగి ఉంటుంది. దీంతో అక్కడి ప్రజలు…
ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్‌ను ప్రదర్శించినపుడు వారు వెలుగులోకి వస్తుంటారు. కొంతమంది ఇనుప ముక్కలను, గాజు ముక్కలను తిని రికార్డ్ సాధిస్తుంటారు. అయితే, ఇరాన్‌కు చెందిన అబోల్ ఫాజీ ముఖ్తారీ అనే వ్యక్తి అందరికంటే భిన్నంగా తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. తన శరీరంపై 85 స్పూన్లను బ్యాలెన్స్ చేస్తూ రికార్డ్ సాధించాడు. మామూలుగా శరీరంపై స్పూన్లను పేర్చి అవి కిందపడకుండా బ్యాలెన్స్ చేయాలంటే సాధ్యపడే పనికాదు. కానీ, అబోల్ ఫాజీ ముఖ్తారీ అనే వ్యక్తి…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ లు ఆక్రమించుకున్నాక అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తాలిబన్ ప్రభుత్వంను అధికారికంగా ఏ దేశాలు గుర్తించలేదు. తాలిబన్లకు మిత్రులుగా ఉన్న పాక్, చైనాలు కూడా అధికారికంగా గుర్తించలేదు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో 22 శాతం మంది ప్రజలు ఆకలితో అలమటిస్తుండగా, మరో 36 శాతం మంది ప్రజలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. తాలిబన్ లు అధికారంలోకి వస్తే పాక్ ప్రాభల్యం పెరుగుతుందని, ఇది పోరుగునున్న భారత్‌కు ఇబ్బందికరమని, ఆఫ్ఘనిస్తాన్‌లో భారత్ చేపడుతున్న ప్రాజెక్టులకు,…