FIFA: అమెరికా చేతిలో ఓటమిని.. సెలబ్రేట్ చేసుకున్న వ్యక్తిని చంపిన ఇరాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iranian Killed For Celebrating FIFA World Cup Loss to United States: ఖతార్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ జరుగుతోంది. ఇటీవల అమెరికా చేతిలో ఇరాన్ ఓడిపోవడంతో అక్కడి ప్రజలు దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. సాధారణంగా తమ దేశం గెలిస్తే సంబరాలు చేసుకునే ప్రజలు, ఓడిపోయినందుకు సంబరాలు చేసుకున్నారు. మహ్సఅమిని పోలీస్ కస్టడీలో చనిపోవడంతో ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక అల్లర్లు చెలరేగాయి. ఈ క్రమంలో దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న సమయంలో ఇరాన్ జట్టు ఫిఫాలో మ్యాచులు ఆడేందుకు వెళ్లడంపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వకపోవడంతోనే ఇరాన్ ఓటమిని సెలబ్రేట్ చేసుకున్నారు ఇరాన్ ప్రజలు.
Read Also: Virat Kohli: విరాట్ కోహ్లీ సిక్స్‌పై పెదవి విప్పిన పాక్ బౌలర్ హారీస్ రౌఫ్..
Also Read
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
మంగళవారం రాత్రి ఖతార్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో ఇరాన్‌ను యునైటెడ్ స్టేట్స్ ఓడించింది. ఇదిలా ఉంటే ఈ ఓటమిని సెలబ్రేట్ చేసుకుంటున్న ఓ వ్యక్తిని ఇరాన్ భద్రతా బలగాలు కాల్చి చంపాయని హక్కుల సంఘాలు బుధవారం తెలిపాయి. టెహ్రాన్‌కు వాయువ్యంగా కాస్పియన్ సముద్ర తీరంలో ఉన్న బందర్ అంజాలి అనే నగరంలో మెహ్రాన్ సమక్ (27) కాల్చిచంపినట్లు ఓస్లోలోని ఇరాన్ హ్యూమన్ రైట్స్ గ్రూప్ వెల్లడించింది. తలపై కాల్చి సమక్ ను చంపినట్లు తెలిపింది. హిజాబ్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటున్న నిరసనకారులు ఈ ఓటమిపై సంబరాలు చేసుకున్నారు. ఈ నిరసనలను అణచివేసే ప్రయత్నం చేస్తోంది ఇరాన్.
గత రెండు నెలలుగా ఇరాన్ వ్యాప్తంగా యాంటీ హిజాబ్ నిరసనలు జరుగుతున్నాయి. 22 ఏళ్ల మహ్సా అమిని అనే యువతిని అక్కడి మోరాలిటీ పోలీసులు హిజాబ్ ధరించలేదని అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆ యువతి చనిపోవడంతో అక్కడ ఉద్యమం ప్రారంభం అయింది. యువత, మహిళలు ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. మహిళలు హిజాబ్ విసిరేస్తూ, జట్టు కత్తిరించుకుని నిరసన తెలుపుతున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. ఇప్పటి వరకు ఇరాన్ వ్యాప్తంగా యాంటీ హిజాబ్ అల్లర్లలో 448 మంది చనిపోయారు.
తాజావార్తలు
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!