ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలం కోసం నవంబర్ 15 లోపు రిటైన్ లిస్ట్ ప్రకటించాలని 10 ఫ్రాంచైజీలకు భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రిలీజ్ లిస్టుపై ఫ్రాంచైజీలు దృష్టి సారించాయి. తుది గడువుకు ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఫ్రాంచైజీలు రిలీజ్ చేసే ప్లేయర్స్ వీరే అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో చెన్నై…
గత సంవత్సరం ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) చాలా కొత్తగా కనిపించింది. కొత్త జయమాన్యం, కొత్త కోచింగ్ సిబ్బంది మాత్రమే కాకుండా.. కొత్త కెప్టెన్‌గా అక్షర్ పటేల్ నియమితుడయ్యాడు. లీగ్ మొదటి అర్ధభాగంలో డీసీ బాగా ఆడింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లను గెలిచి.. ఐదవ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో తృటిలో ఓడింది. ఆరవ మ్యాచ్‌లో విజయాన్ని సాధించిన ఢిల్లీ.. ఆపై పూర్తిగా గాడి తప్పింది. తదుపరి ఎనిమిది మ్యాచ్‌లలో రెండింటిని మాత్రమే గెలిచారు. అందులో ఒకటి వర్షం…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీని విక్రయించే అవకాశం ఉంది. ఆర్సీబీ ఫ్రాంచైజీ విక్రయ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఐపీఎల్ 2026కి ముందే ఫ్రాంచైజీని విక్రయించే అవకాశం ఉందని డియాజియో పీఎల్‌సీకి చెందిన భారత అనుబంధ సంస్థ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యూఎస్ఎల్) బుధవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)కి ఓ లేఖ రాసింది. ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టే వారి కోసం…
SRH IPL 2026: ఐపీఎల్ 2026 వేలానికి ముందు ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను ఖరారు చేయడానికి సమయం ఆసన్నమవుతోంది. నవంబర్ 15 గడువు సమీపిస్తున్న నేపథ్యంలో.. జట్లలోని ఆటగాళ్ల మార్పులపై ఊహాగానాలు, నివేదికలు అమాంతం పెరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఓ నివేదిక ప్రకారం.. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులోని స్టార్ ఆటగాడు దక్షిణాఫ్రికా వికెట్ కీపర్-బ్యాటర్ హెన్రీచ్ క్లాసెన్‌ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది క్లాసెన్‌ను SRH ఐపీఎల్ రికార్డు రిటెన్షన్…
Rohit Sharma: ఐపీఎల్ 2026 సమీపిస్తున్న కొద్దీ క్రికెట్ వర్గాల్లో ఓ పెద్ద చర్చ నడుస్తోంది. అదే ముంబై ఇండియన్స్ (MI) మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) జట్టులో చేరబోతున్నాడా? అని. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు కేకేఆర్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. రోహిత్ సన్నిహిత మిత్రుడు తాజాగా కేకేఆర్ హెడ్ కోచ్‌గా నియమితులైన అభిషేక్ నాయర్ మార్గదర్శకత్వంలో ఆడవచ్చని అభిమానులు ఊహిస్తున్నారు.…
Abhishek Nayar: ఐపీఎల్ 2026 సీజన్‌కు జట్లు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాయి. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) నుంచి ముఖ్యమైన వార్త వచ్చింది. ఈ జట్టు తన కోచింగ్ సెటప్‌లో భారీ మార్పులు చేసింది. కేకేఆర్ హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్‌ను నియమించింది. గతంలో ఈ టీంకు చంద్రకాంత్ పండిట్ ప్రధాన కోచ్‌గా సేవలు అందించారు. ఆయన స్థానంలో కొత్తగా అభిషేక్ నాయర్ నియమితులయ్యారు. READ ALSO: Top Headlines @5PM : టాప్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 కోసం మినీ వేలం డిసెంబర్ 13-15 మధ్య జరిగే అవకాశం ఉంది. అన్ని జట్లు నవంబర్ 15 లోపు తమ రిటెన్షన్, రిలీజ్ లిస్టులను సమర్పించాలి. ఐపీఎల్ వేలానికి ముందు కొన్ని జట్లు ఆటగాళ్లను విడుదల చేయడమే కాకుండా, సహాయక సిబ్బందిలో కూడా మార్పులు చేస్తున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ ఇటీవల కేన్ విలియమ్సన్‌ను వ్యూహాత్మక సలహాదారుగా నియమించింది. తాజాగా పంజాబ్ కింగ్స్ కూడా తమ సహాయక సిబ్బందిలో కీలక…
ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి ఫ్రాంచైజీలు వదిలేసే ప్లేయర్ల గురించి సోషల్ మీడియాలో గుసగుసలు వినపడుతున్నాయి. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ నుంచి స్టార్ ప్లేయర్స్ ఐదుగురు అవుట్ అంటూ ఓ న్యూస్ వచ్చింది. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గురించి కూడా ఒక వార్త హల్చల్ చేస్తుంది. వచ్చే మినీ ఆక్షన్ ముందు ఆర్సీబీ ఏడుగురు ఆటగాళ్లను వదిలేయనుందని సమాచారం. ఈ లిస్టులో స్టార్ ప్లేయర్స్ కూడా ఉండడం గమనార్హం. Also Read:…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026కి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఐపీఎల్ 2026 వేలం తేదీలు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. వేలం 2025 డిసెంబర్ 13–15 మధ్య తేదీల్లో జరగనుందని సమాచారం. ఫ్రాంచైజీ యజమానులు బీసీసీఐతో చర్చించి.. ఈ తేదీలను సూచించారట. అయితే వేలం తేదీల విషయంకి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌దే తుది నిర్ణయం. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇంకా అధికారికంగా షెడ్యూల్‌ను ప్రకటించలేదు. Also Read: IND vs…
ఐపీఎల్ 2026 వేలం డిసెంబర్ రెండవ లేదా మూడవ వారంలో జరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 13-15 వరకు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫ్రాంచైజీ అధికారులు బీసీసీఐతో చర్చలు జరుపుతున్న క్రిక్‌బజ్ తమ కథనంలో పేర్కొంది. ఐపీఎల్ పాలక మండలి ఐపీఎల్ 2026కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదు. వేలంకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఐపీఎల్ 2025లో చివరి స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే).. 2026 వేలానికి ముందు కఠిన…