ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలంకు రంగం సిద్దమైంది. అబుదాబిలో డిసెంబర్ 16న మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో వేలం జరగనుంది. వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా విడుదల చేసింది. మినీ వేలంలో పాల్గొనడానికి 1,355 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకోగా.. ఏకంగా 1,005 మంది పేర్లను బీసీసీఐ తొలగించింది. 350 మంది ఆటగాళ్లు మినీ వేలంకు అందుబాటులో ఉన్నారు. ఇందులో 35 మంది…
Kohli 100 Centuries: భారత క్రికెట్ లెజెండర్ సునీల్ గవాస్కర్ మరోసారి విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. ఈ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మూడు సంవత్సరాలు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగితే 100 శతకాలు పూర్తి చేస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు.
Big Relief for RCB Fans: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు కర్ణాటక ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాబోయే రోజుల్లో ఐపీఎల్ మ్యాచ్‌లకు చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇస్తుందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈరోజు ( డిసెంబర్ 7న) ప్రకటించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలంకు సమయం దగ్గరపడుతోంది. డిసెంబరు 16న అబుదాబిలో మినీ వేలం జరగనుంది. వేలంలో 1,355 మంది ప్లేయర్స్ తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు క్రిక్‌బజ్ తన కథనంలో పేర్కొంది. 10 జట్లలో కలిపి 77 స్లాట్లు ఖాళీగా ఉండగా.. ఇందులో విదేశీ ప్లేయర్ల స్లాట్లు 31 కావడం విశేషం. రిజిస్ట్రేషన్ లిస్ట్‌లో 14 దేశాల నుంచి ఆటగాళ్లు ఉండగా.. మినీ వేలానికి రికార్డ్ రిజిస్ట్రేషన్స్ రావడం గమనార్హం. రిజిస్ట్రేషన్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. డిసెంబర్ 16న అబుదాబిలో జరగనున్న వేలం కోసం ఏకంగా 1,355 మంది ఆటగాళ్లు అధికారికంగా నమోదు చేసుకున్నారు. క్రిక్‌బజ్ ప్రకారం ఆటగాళ్ల జాబితా లిస్ట్ 13 పేజీలు ఉండడం విశేషం. ఓ మినీ వేలానికి రికార్డ్ రిజిస్ట్రేషన్స్ రావడం ఇదే మొదటిసారి. రిజిస్ట్రేషన్ లిస్ట్‌లో 14 దేశాల నుంచి ఆటగాళ్లు ఉన్నారు. ఈ వేలంలో ప్రాంచైజీల మధ్య పోటీ బాగా ఉండనుంది. ఇందుకు కారణం…
IPL 2026: ఐపీఎల్ (IPL) తొలి ఛాంపియన్స్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు తాజాగా కీలక ప్రకటన చేసింది. శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కరను తమ జట్టుకు హెడ్ కోచ్‌గా తిరిగి నియమించినట్లు ప్రకటించింది. గతంలో ఐపీఎల్ 2025 సీజన్లో రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్‌గా ఉన్నప్పుడు.. సంగక్కర రాయల్స్ ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’ పదవిలో కొనసాగారు. అలాగే సంగక్కర గతంలో 2021 నుంచి 2024 వరకు రాయల్స్‌కు హెడ్ కోచ్‌గా పనిచేశారు. ఇప్పుడు…
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్- 2026 వేలానికి అన్ని జట్ల ఫ్రాంఛైజీలు రెడీ అయ్యాయి. తమకు కావాల్సిన ప్లేయర్స్ ను అట్టిపెట్టుకున్న యాజమాన్యాలు.. భారం అనుకున్న వారిని వదిలించుకుంది.
ఐపీఎల్ 2026 కోసం ఆటగాళ్లను రిటైన్ చేసుకునే తుది గడువు సమీపిస్తోంది. ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్టును సమర్పించేందుకు నవంబర్ 15 చివరి తేదీ. శనివారం మధ్యాహ్నం 3 గంటలలోపు బీసీసీఐకి 10 ఫ్రాంచైజీలు తమ లిస్టును సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ట్రేడ్ ఒప్పందాలను కొన్ని కుదిరాయి. టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ట్రేడ్ ద్వారా ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. రూ.2 కోట్లకు ముంబై ఒప్పందం చేసుకుంది. ఈ…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలంకు సంబంధించి ఓ బిగ్ అప్డేట్ వచ్చింది. వేలం డిసెంబర్ 16న జరగనునట్లు సమాచారం. ఇండియాలో కాకుండా అబుదాబిలో వేలం నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్లాన్ చేస్తోందట. మినీ వేలం కాబట్టి ఒకే రోజులో ముగియనుంది. ఈ మేరకు ఓ క్రీడా ఛానెల్ తమ కథనంలో పేర్కొంది. ముంబైలో డిసెంబర్ 15న వేలం జరగనున్నట్లు ముందు నుంచి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఐపీఎల్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలం వచ్చే డిసెంబర్లో జరగనుంది. ఫ్రాంచైజీలు విడుదల చేయాలనుకునే ఆటగాళ్ల జాబితాను నవంబర్ 15 లోపు సమర్పించాల్సి ఉంది. అయితే ఐపీఎల్ 2026 ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. అసిస్టెంట్ కోచ్‌గా ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌ను నియమించింది. ఈ విషయాన్ని కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ తెలిపారు. ఇక కేకేఆర్ హెడ్ కోచ్ అభిషేక్ నాయర్‌తో కలిసి వాట్సన్…