క్రికెట్లో అసాధ్యం కానిదంటూ ఏమీ లేదని అంటారు. మ్యాచ్‌లో ప్రతి బంతికి పరిస్థితులు మారుతూ ఉంటాయి. జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన విజయ్ హజారే ట్రోఫీ ఎలైట్ గ్రూప్ బి మ్యాచ్‌లో కూడా ఇలాంటిదే జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆటగాళ్ల ఉత్సాహం పరిమితులను మించిపోయింది. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఆకిబ్ నబీ హైదరాబాద్‌పై విరుచుకుపడ్డాడు. ఆకిబ్ నబీ ఫాస్ట్ బౌలర్ అయినా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. ఎనిమిదో స్థానంలో వచ్చి…
భారత యువ సంచలనం ‘వైభవ్ సూర్యవంశీ’ కెరీర్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతున్నాడు. సింగిల్ తీసినంత ఈజీగా.. సిక్సులు బాదేస్తున్నాడు. 14 ఏళ్ల వైభవ్ గత ఏడాది కాలంగా దేశవాళీ, అండర్-19 క్రికెట్లో సులువుగా సెంచరీలు చేస్తున్నాడు. ముఖ్యంగా గత నెల రోజుల్లో సునామీ ఇన్నింగ్స్‌లు ఆడుతూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. యువ సంచలనం వైభవ్ ఆటకు టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫిదా అయ్యాడు. భారీ స్కోర్లను పోల్చుతూ.. ఏంటి తమ్ముడు ఈ అరాచకం అంటూ…
బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. 2026 ఐపీఎల్ కోసం ముస్తాఫిజుర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) రూ.9.20 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అయితే బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై హింస తర్వాత ఐపీఎల్లో ముస్తాఫిజుర్ ఆడదాన్ని వ్యతిరేకిస్తూ భారతదేశంలో నిరసనలు చెలరేగాయి. దాంతో ముస్తాఫిజుర్‌ను విడుదల చేయాలని కేకేఆర్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశించింది. బీసీసీఐ నిర్ణయంతో ముస్తాఫిజుర్ భారీ మొత్తంలో డబ్బు కోల్పోనున్నాడు.…
భారత్‌లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026కు తమ జట్టును పంపడంపై భద్రతా పరమైన ఆందోళనలు ఉన్నాయని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసీబీ) అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశానికి జట్టును పంపడం తమకు సురక్షితంగా అనిపించడం లేదని సోమవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇదే విషయాన్ని బీసీబీ అధికారికంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి లేఖ ద్వారా తెలియజేసినట్టు వెల్లడించారు. ఐపీఎల్ 2026లో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహమాన్ ఆడకూడని బీసీసీఐ ఆదేశాలు జారీ…
ఐపీఎల్ 2026 వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) భారీ ధరకు కొనుగోలు చేసిన బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజూర్ రహ్మాన్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. 2025 డిసెంబర్ 16న అబూదాబీలో జరిగిన వేలంలో ముస్తాఫిజూర్‌ను రూ.9.20 కోట్లకు కేకేఆర్ దక్కించుకుంది. అయితే వేలం ముగిసిన కొద్ది రోజులకే అంతా మారిపోయింది. బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై పెరుగుతున్న హింసాత్మక ఘటనలు, హత్యల నేపథ్యంలో ముస్తాఫిజూర్ విషయంలో బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా…
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందే రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) శిబిరంలో కెప్టెన్సీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. మాజీ కెప్టెన్ సంజూ శాంసన్ అనంతరం నాయకత్వ బాధ్యతలు ఎవరు చేపడతారనే దానిపై అటు అభిమానుల్లోనూ, ఇటు క్రికెట్ వర్గాల్లోనూ జోరుగా చర్చ జరుగుతోంది. యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ పేర్లు ముందుకొస్తున్నప్పటికీ.. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజానే తదుపరి కెప్టెన్‌గా ఉండాలంటూ పలువురు మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ అంటున్నారు. ఈ స్పెక్యులేషన్ల మధ్య రాజస్థాన్ తాజాగా చేసిన…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026కు సంబంధించిన వేలం ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. వేలంలో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) ఆచితూచి వ్యహరించింది. వేలంకు ముందే చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్ సంజు శాంసన్‌ను ట్రేడ్ చేసింది. మినీ వేలం తర్వాత జడేజా, సామ్ కరణ్, రవి బిష్ణోయ్ వంటి ఆటగాళ్లతో బలమైన జట్టును ఏర్పాటు చేసింది. అయితే కెప్టెన్సీ మాత్రం ప్రశ్నార్థకంగానే ఉంది. దీనిపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప తన అభిప్రాయం వ్యక్తం…
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. డిసెంబర్ 24న బీహార్ తరఫున బరిలోకి దిగిన బుడ్డోడు.. అరుణాచల్ ప్రదేశ్‌పై 84 బంతుల్లో 190 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 15 సిక్స్‌కు ఉండడం విశేషం. లిస్ట్-ఎ క్రికెట్లో సెంచరీ చేసిన అత్యంత పిన్నవయస్కుడిగా (14 ఏళ్ల 272 రోజులు)గా వైభవ్ రికార్డుల్లో నిలిచాడు. అయితే బీహార్ తరఫున రెండవ మ్యాచ్‌లో…
IPL 2026: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ఇంకా మూడు నెలలకుపైగా సమయం ఉన్నప్పటికీ.. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఇప్పటికే తమ సన్నాహాలను వేగవంతం చేసింది. ఇప్పటివరకు ఐపీఎల్లో తొలి టైటిల్‌ను అందుకోలేకపోయిన ఈ ఫ్రాంచైజీ ఆ లోటును తీర్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా జట్టు భారతీయ ఫాస్ట్ బౌలర్లను ఒక విదేశీ టీ20 లీగ్‌కు పంపేందుకు బీసీసీఐ నుంచి అనుమతి కూడా పొందింది. IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కెప్టెన్..? అక్షర్…
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) శిబిరంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. అందిన సమాచారం ప్రకారం.. గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు నాయకత్వం వహించిన అక్షర్ పటేల్‌ను వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. ఇకపై అక్షర్ కేవలం ఆటగాడిగా మాత్రమే జట్టులో కొనసాగబోతున్నట్లు సమాచారం. H-1B, H-4 వీసా దరఖాస్తుదారులకు అమెరికా గ్లోబల్ అలర్ట్.. మరింత కఠినంగా…