IPL 2026: RCB అభిమానులకు గుడ్ న్యూస్.. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లకు అనుమతి!
- IPL 2026 మ్యాచ్‌లను బెంగళూరులో నిర్వహించేందుకు అనుమతి
- M. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహించేందుకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని M. చిన్నస్వామి స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 (IPL 2026) సీజన్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. గత కొన్ని నెలలుగా ఈ వేదికపై మ్యాచ్‌లు జరుగుతాయా లేదా అనే సందేహం నెలకొంది. దీనికి కారణం లేకపోలేదు. 2025 జూన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సంబరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత భద్రతా అంశాలపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత గలీజుగా ఉన్నారేంట్రా.. సె*క్స్ చేస్తావా అంటూ!
Also Read
- 150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
- Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
ఆ ఘటన తర్వాత చిన్నస్వామి స్టేడియాన్ని పెద్ద ఈవెంట్లకు అనుకూలం కాదని అధికారులు ప్రకటించారు. అప్పటి నుంచి ఈ వేదికపై ఒక్క పోటీ మ్యాచ్ కూడా నిర్వహించలేదు. ముఖ్యంగా ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ లో జరగాల్సిన కీలక మ్యాచ్ లను కూడా చివరి నిమిషంలో ఇతర వేదికలకు మార్చారు. వేదిక సంబంధించి సందేహాలు కొనసాగడంతో.. ఆర్సీబీ తాత్కాలిక హోం గ్రౌండ్ కోసం ఇతర ఎంపికలను పరిశీలించింది. ఆ సమయంలో డీవై పాటిల్ స్టేడియంను ప్రత్యామ్నాయంగా ఉపయోగించే అవకాశాలపై నివేదికలు వెలువడ్డాయి.
అయితే చివరికి మ్యాచ్‌లు చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించాలా లేదా అనే తుది నిర్ణయం ఆర్సీబీ ఫ్రాంచైజీదే. ప్రస్తుత సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న ఆర్సీబీకి ఈసారి ఐపీఎల్ ఫైనల్‌ను నిర్వహించే హక్కు కూడా ఉండటం వల్ల ఈ నిర్ణయం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. గత సీజన్‌లో జరిగిన ఫైనల్‌లో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించింది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఆ ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత తొలి టైటిల్‌ను గెలుచుకుంది. అయితే ఆనందోత్సాహాల మధ్య జరిగిన తొక్కిసలాట ఘటన ఆ రోజు పెను విషాదంగా మారింది. ఇప్పుడీ అనుమతితో చిన్నస్వామి స్టేడియం మళ్లీ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!