IPL 2026: కొత్త లోగోతో కొత్త ప్రారంభం.. Lucknow Super Giants కొత్త లోగో ఆవిష్కరణ!
- LSC కొత్త లోగో..
- కొత్త లోగోలో రెడ్ కలర్ థీమ్..
- గరుడ, కిరీటం, ఏనుగు ప్రతీకలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026 Lucknow Super Giants: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants (LSG)) తమ కొత్త లోగోను అధికారికంగా విడుదల చేసింది. గతంలో నీలి రంగు థీమ్‌లో ఉన్న లోగోను మార్చి.. ఈసారి రెడ్ కలర్ ఆధారంగా రూపొందించిన కొత్త ఎంబ్లమ్ ను చేర్చింది. ఈ లోగోలో గరుడ, కిరీటం, ఏనుగు అనే మూడు ప్రధాన ప్రతీకలను చేర్చడం ద్వారా లక్నో నగరం, ఉత్తరప్రదేశ్ సంస్కృతి, గౌరవాన్ని ప్రతిబింబించేలా లోగోను డిజైన్ చేశారు.
ప్రత్యర్థులకు గుండె గుబేల్.. 110 బిలియన్ డాలర్ల పెట్టుబడితో Reliance Industries భారీ స్కెచ్!
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ఈ కొత్త లోగోలో గరుడ ప్రతీక జట్టుకు ఉన్న ధైర్యం, సవాళ్లను అధిగమించి ఎత్తులకు ఎదగాలనే లక్ష్యాన్ని సూచిస్తుంది. జట్టు ఆడే దూకుడు, విజయం సాధించాలనే ఆకాంక్షను ఇది ప్రతిబింబిస్తుందని ఫ్రాంచైజీ తెలిపింది. ఇంకా లోగోలోని కిరీటం జట్టు గౌరవం, బాధ్యతను సూచిస్తుంది. మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి లక్షలాది అభిమానుల ఆశలు, విశ్వాసాన్ని మోస్తున్నామనే భావనను ఇది తెలియజేస్తుంది. ఇక లోగో మధ్యలో ఉన్న ఏనుగు శక్తి, సహనం, జ్ఞానం, ఐక్యతను సూచిస్తుంది. ఫలితాలు ఎలా ఉన్నా జట్టుకు అండగా నిలిచే అభిమానుల విశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.
జట్టు యజమాని, RPSG గ్రూప్ వైస్ చైర్మన్ శశ్వత్ గోయెంకా మాట్లాడుతూ.. ఈ లోగో తమకు భావోద్వేగపూరితమైన గుర్తింపు అని తెలిపారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు మొదటి రోజు నుంచే జట్టును ఆదరించారని, ఆ ప్రేమకు గుర్తుగా ఈ కొత్త లోగోను రూపొందించామని చెప్పారు. ఇది కేవలం డిజైన్ మార్పు మాత్రమే కాకుండా.. లక్నో నగర గౌరవాన్ని నిలబెట్టే వాగ్దానం అని ఆయన పేర్కొన్నారు.
55dB ANC, 54 గంటల బ్యాటరీ, సూపర్ ఫీచర్లతో Oppo Enco Air 5 Pro లాంచ్..!
2026 సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ జట్టు (స్క్వాడ్):
రిషభ్ పంత్, అబ్దుల్ సమద్, ఆయుష్ బడోని, ఎయిడెన్ మార్క్రం, మిచెల్ మార్ష్, మాథ్యూ బ్రెట్జ్కీ, నికోలస్ పూరన్, హిమ్మత్ సింగ్, షాహ్‌బాజ్ అహ్మద్, అర్షిన్ కులకర్ణి, మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్, మొహ్సిన్ ఖాన్, దిగ్వేష్ రాథి, ఎం. సిద్ధార్థ్, ప్రిన్స్ యాదవ్, ఆకాష్ సింగ్, అర్జున్ టెండూల్కర్, మొహమ్మద్ షమీ, నమన్ తివారి, వనిందు హసరంగా, జోష్ ఇంగ్లిస్, అక్షత్ రఘువంశీ, అన్రిచ్ నోర్జే, ముకుల్ చౌదరి.
Junoon hai, Toofan hai. Lucknow Super Giants ki ye ek nayi udaan hai 💙❤️ pic.twitter.com/xaLnnnZcwr
— Lucknow Super Giants (@LucknowIPL) February 24, 2026
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!