ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొత్త బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ మునాఫ్ పటేల్‌ను కొత్త బౌలింగ్ కోచ్‌గా నియమించింది. ఈ విషయాన్ని ఢిల్లీ ఫ్రాంచైజీ మంగళవారం ప్రకటించింది. ప్రధాన కోచ్ హేమంగ్ బదానీ, క్రికెట్ డైరెక్టర్ వేణుగోపాలరావుతో పాటు ఢిల్లీ కోచింగ్ స్టాఫ్‌లో భాగంగా ఉంటారు. మునాఫ్ 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడు. 2018లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. ఐపీఎల్ మెగా వేలంకు ముందు ప్రాంఛైజీలు తమ రిటైన్ లిస్టును ప్రకటించిన విషయం తెలిసిందే. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) ఫ్రాంచైజీ నుంచి టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బయటికొచ్చేశాడు. రాహుల్‌ను రిటైన్ చేసుకోవడానికి ఎల్‌ఎస్‌జీ ఆసక్తి చూపినా.. అతడు అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో ఎల్‌ఎస్‌జీ ఓనర్ సంజీవ్ గోయెంకా మైదనంలోనే ఆగ్రహం వ్యక్తం చేయడంతో…
ఐపీఎల్ 2025 మెగా వేలం మరికొన్ని రోజుల్లో జరగనుంది. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. మెగా వేలంకు ముందు తమ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) ఫ్రాంచైజీ విడిచి పెట్టిన విషయం తెలిసిందే. అట్టిపెట్టుకోవాలని ఎల్‌ఎస్‌జీ ఓనర్ సంజీవ్ గోయెంకా చూసినా.. అందుకు రాహుల్ ఒప్పుకోలేదట. ఏదేమైనా మెగా వేలంలో రాహుల్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అభిమానుల కోసం తాజాగా బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలంలో 1,574 మంది ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. 16 విదేశాలకు చెందిన ఆటగాళ్లు వేలంలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మొత్తం 409 విదేశీ ప్లేయర్స్ వేలంలో అందుబాటులో ఉన్నారు. జోస్ బట్లర్, మిచెల్ స్టార్క్, జోఫ్రా ఆర్చర్, నాథన్ లైయన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ లాంటి విదేశీ స్టార్ ప్లేయర్స్‌పై అందరి దృష్టి ఉంది. మరో విదేశీ ఆటగాడు కూడా హైలెట్‌గా నిలవనున్నాడు. అతడే 24 ఏళ్ల ఫాస్ట్…
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ప్రాంచైజీ ముగ్గురిని మాత్రమే రిటైన్ చేసుకుంది. విరాట్ కోహ్లీ (రూ.21 కోట్లు), రజత్ పాటిదార్ (రూ.11 కోట్లు), యశ్ దయాళ్ (రూ.5 కోట్లు)ను ఆర్‌సీబీ అట్టిపెట్టుకుంది. చాలామంది స్టార్ ఆటగాళ్లను వేలంలోకి వదిలేసింది. 2021 నుంచి జట్టులో ఉన్న ఆస్ట్రేలియా హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను ఆర్‌సీబీ రిటైన్ చేసుకోలేదు. ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆర్‌సీబీ తనను అట్టిపెట్టుకోవడంపై తాజాగా మ్యాక్సీ స్పందించాడు.…
ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. సోమవారం (నవంబర్ 4)తో ఆటగాళ్ల నమోదు అధికారికంగా ముగియగా.. మొత్తం 1,574 మంది క్రికెటర్లు వేలం కోసం పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో 1,165 మంది భారతీయ క్రికెటర్స్ ఉండగా.. 409 మంది విదేశీయులు ఉన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి వేలంలో చాలా మంది టీమిండియా స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. వీరు మెగా వేలంలో భారీ ధర పలికే…
ఐపీఎల్ 2025 మెగా వేలం డేట్స్ వచ్చేశాయి. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలంను బీసీసీఐ నిర్వహించనుంది. మెగా వేలంకు మోతగం 1,574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 1,165 మంది భారత క్రికెటర్లు కాగా.. 409 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. విదేశీ ఆటగాళ్లలో అత్యధికంగా దక్షిణాఫ్రికా నుంచి 91 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఆస్ట్రేలియా నుంచి 76 మంది, ఇంగ్లండ్ నుంచి 52 మంది,…
ఐపీఎల్ 2025 మెగా వేలం డేట్స్ వచ్చేశాయి. ఈ నెల 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలం జరగనుంది. నవంబర్ 4తో ఆటగాళ్ల నమోదు ప్రక్రియ అధికారికంగా ముగిసింది. మొత్తం 1,574 మంది ప్లేయర్స్ వేలం కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. అంతకుముందు అక్టోబర్ 31న రిటెన్షన్ జాబితాకు గడువు ముగియగా.. 10 ప్రాంఛైజీలు తమ లిస్ట్ ప్రకటించాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్ రిషబ్ పంత్‌ను వేలంలోకి వదిలేసింది. మేనేజ్‌మెంట్‌తో తలెత్తిన విభేదాల…
ఐపీఎల్ 2025 మెగా వేలం తేదీలు ఖరారు అయ్యాయి. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలం జరగనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. సోమవారంతో (నవంబర్ 4) ప్లేయర్ రిజిస్ట్రేషన్ అధికారికంగా ముగిసింది. మొత్తం 1,574 మంది క్రికెటర్లు మెగా వేలం కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో 1,165 మంది భారతీయులు ఉండగా.. 409 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. ఐపీఎల్ 2025 వేలం జాబితాలో 320 క్యాప్డ్ ప్లేయర్లు,…
ఐపీఎల్ (IPL 2025) మెగా వేలం ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనే దానిపై క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను రిటెన్షన్, రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.. ఇక ఉన్నదంతా మెగా వేలం ఎప్పుడు జరుతుందనేది. మెగా వేలంలో ఫ్రాంఛైజీలు ఏ ఏ ఆటగాళ్లను తీసుకుంటారు... ఏఏ ఆటగాళ్లు ఏ జట్టుకు వెళ్తారనేది క్రికెట్ అభిమానుల్లో సస్పెన్స్ నెలకొంది.