IPL Auction 2025: జెడ్డాలో ఐపీఎల్ మెగా వేలం.. పేర్లు నమోదు చేసుకున్న 1574 మంది క్రికెటర్లు!
- జెడ్డాలో ఐపీఎల్ మెగా వేలం
- మెగా వేలం డేట్స్ ఎప్పుడంటే?
- 409 మంది విదేశీ ప్లేయర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025 మెగా వేలం తేదీలు ఖరారు అయ్యాయి. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలం జరగనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. సోమవారంతో (నవంబర్ 4) ప్లేయర్ రిజిస్ట్రేషన్ అధికారికంగా ముగిసింది. మొత్తం 1,574 మంది క్రికెటర్లు మెగా వేలం కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో 1,165 మంది భారతీయులు ఉండగా.. 409 మంది విదేశీ ప్లేయర్స్ ఉన్నారు.
ఐపీఎల్ 2025 వేలం జాబితాలో 320 క్యాప్‌డ్ ప్లేయర్‌లు, 1,224 అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌లు, 30 అసోసియేట్ నేషన్స్ ప్లేయర్‌లు ఉన్నారు. 48 మంది క్యాప్‌డ్ ఇండియన్స్, 272 క్యాప్‌డ్ ఇంటర్నేషనల్స్ ప్లేయర్స్, 965 మంది అన్‌క్యాప్‌డ్ ఇండియన్ ప్లేయర్‌లు, 104 అన్‌క్యాప్‌డ్ ఇంటర్నేషనల్స్ ప్లేయర్స్ ఉన్నారు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, అర్ష్‌దీప్ సింగ్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. వీరికి కాసుల వర్షం కురిసే అవకాశం ఉంది;.
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
వేలంలో మొత్తం 204 మంది క్రికెటర్లను ఫ్రాంఛైజీలు కొనుక్కోవాల్సి ఉంది. ఒక్కో ఫ్రాంఛైజీ గరిష్టంగా 25 మంది ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవచ్చు. ఇందులో అట్టిపెట్టుకున్న క్రికెటర్స్ కూడా ఉన్నారు. 10 ఫ్రాంఛైజీలు 46 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. జట్లను తయారుచేసుకోవడానికి ప్రతి ఫ్రాంఛైజీకి రూ.120 కోట్లు కేటాయించారు. ఖర్చు చేయడానికి అన్ని ఫ్రాంఛైల వద్ద రూ.641.5 కోట్ల డబ్బుంది. రిటెన్షన్ అనంతరం పంజాబ్ కింగ్స్ వద్ద అత్యధికంగా రూ.110.5 కోట్లు ఉండగా.. అతి తక్కువగా రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ.41 కోట్లు ఉన్నాయి.
తాజావార్తలు
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
-
Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!